చంద్రబాబు అరెస్ట్‌.. బలవంతంగా షాపులు మూయిస్తున్న టీడీపీ నేతలు!

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు సంబంధించి సీమెన్స్‌ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అవ్వటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. శనివారం ఉదయం ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడ్ని నంద్యాలలో అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని విజయవాడ తరలిస్తున్నారు. సొంత వాహనంలో చంద్రబాబును విజయవాడ తీసుకువస్తున్నారు. ఈ రోజు ఆయన్ని విజయవాడలోని మూడవ అదనపు జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు.

చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడ్ని కూడా అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అరాచకాలకు తెరతీశాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. కొన్ని చోట్ల టీడీపీ నేతలు బలవంతంగా షాపులను మూయిస్తున్నారు. ప్రశ్నిస్తున్న దుకాణాదారులపై దాడులు సైతం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

టీడీపీ నేతలు దౌర్జన్యంగా షాపులను మూయించటంపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. మీ నాయకుడ్ని అరెస్ట్‌ చేస్తే.. ప్రజల్ని ఇబ్బందుల పెడతారా అంటూ ఆగ్రహం​ వ్యక్తం చేస్తున్నారు. కాగా, చంద్రబాబునాయుడి అరెస్ట్‌ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పలు చోట్ల ఆర్టీసీ బస్సు సేవల్ని నిలిపి వేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరి, చంద్రబాబును అరెస్ట్‌ చేశారన్న కారణంతో టీడీపీ నేతలు ఏపీలో దౌర్జన్యాలకు పాల్పడ్డంపై అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

Show comments