Arjun Suravaram
ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో జరిగిన వైఎస్సార్ సీపీ సిద్ధం సభ సూపర్ డూపర్ హిటైంది. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ హై వోల్టేజ్ స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించిన కొన్ని అంశాలు టీడీపీ నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో జరిగిన వైఎస్సార్ సీపీ సిద్ధం సభ సూపర్ డూపర్ హిటైంది. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ హై వోల్టేజ్ స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించిన కొన్ని అంశాలు టీడీపీ నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం ప్రారంభమైంది. అధికార వైఎస్సార్ సీపీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతుండగా..ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయనుంది. దీంతో ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయే అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇదే సమయంలో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సాస్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఇప్పటికే సిద్ధం పేరుతో మూడు సభలో నిర్వహించి.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని టాక్. తాజాగా సిద్ధం నాలుగోవ సభలో సీఎం జగన్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ఇదే సమయంలో కొన్ని అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ మాటలే ఇప్పుడు టీడీపీని ఆందోళనకు గురి చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.
బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు కుదిరాక వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సిద్ధం సభకు జనం పోటెత్తారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి జనవరి 27న నిర్వహించిన భీమిలి సభ, ఫిబ్రవరి 3న జరిగిన దెందులూరు సభ, ఫిబ్రవరి 18న నిర్వహించిన రాప్తాడు సిద్ధం సభలు ఒకదానికి మంచి మరొకటి సూపర్ సక్సెస్ అయ్యాయి. వాటికి మించి ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజవర్గం పరిధిలోని మేదరమెట్ల వద్ద జరిగిన సిద్ధం నాలుగోవ సభ సూపర్ హిట్ అయింది. వైఎస్సార్‌సీపీ ఎన్నికల సన్నాహక సభలు ఈ స్థాయిలో గ్రాండ్ సక్సెస్ కావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ లు వణికిపోతున్నాయి.
ఇక అద్దంకిలో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్ ఇచ్చిన స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. రాష్ట్రంలో 58 నెలల వైఎస్సార్ సీపీ పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరించారు. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై పదునైన విమర్శలతో విరుచుకుపడుతూ సీఎం జగన్ ప్రసంగించారు. 2014 ఎన్నికల్లోనూ ఆ మూడు పార్టీలు జట్టు కట్టాయని గుర్తుచేస్తూ రుణమాఫీ పేరుతో రైతులకు, మహిళలకు చంద్రబాబు చేసిన మోసాలను సీఎం జగన్ ప్రస్తావించారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను చంద్రబాబు వంచించిన వైనాన్ని ఈ సభలో ప్రస్తావించారు.
అంతేకాక 2014లో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని గెలిచిన తరువాత మేనిఫెస్టోను చెత్త బుట్టలే వేశారని సీఎం జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు హామీలకు శకుని చేతిలో పాచికలకు తేడా లేదంటూ విమర్శించడంతో జనం హర్షధ్వానాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలిచేందుకు ఎన్నో అబద్ధాల హామీలతో ప్రజల్లోకి ముందుకు వస్తాడని, ముసలి పులి బంగారం చూపించినట్లు ఎన్నో హామీలు కురిపిస్తాడని, నమ్మితే మాత్రం చంద్రముఖిని మన ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుందని సీఎం జగన్ అన్నారు.
ఇక సిద్ధం సభలో 2014లో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోను చూపిస్తూ అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలపై ప్రస్తావించడంతో టీడీపీలో ఓ ఆందోళన ప్రారంభమైందనే టాక్ వినిపిస్తోంది. గతంలో తాము ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని, ఈ సారి అంతకు మించిన హామీలతో జనాల్లోకి వెళ్లిన నమ్మేలా లేరని వారు ఆందోళన చెందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్షల మంది జనాల సమక్షంలో టీడీపీ మేనిఫెస్టో ను వివరించడమే కాకుండా.. వారు చేసిన మోసాలను ఎండగట్టారు.
అలానే తాను మాత్రం చేయగలిగిన వాటిని ప్రకటిస్తాని స్పష్టం చేశారు. ఇలా సీఎం జగన్ పదునైన మాటలతో ప్రజలల్లో టీడీపీ మోసాలను తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇక భవిష్యత్ లో తాము ప్రకటించే మేనిఫెస్టోను, హామీలను ప్రజలను నమ్మకపోవచ్చునే భయంలో టీడీపీ నేతలు ఉన్నారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. మొత్తంగా సీఎం జగన్ తన పరిపాలన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా.. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.