Dharani
ప్రమఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు..
ప్రమఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు..
Dharani
నైనా జైస్వాల్.. అతి చిన్న వయసులోనే విభిన్న రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి.. ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది ఈ యువతి. చిన్న వయసులోనే ఈమె సాధించిన విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకం. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 16 ఏళ్ల వయసుకే పీజీ పూర్తి చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత పీహెచ్‌డీ కూడా అందుకుంది. ఆసియాలోనే అత్యంత చిన్న వయసులోనే ఈ రికార్డు క్రియేట్ చేసిన యువతిగా చరిత్రకెక్కింది. ఈ క్రమంలో తాజాగా నైనా ఏపీకి వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. ఆమె ప్రసంగిస్తూ.. సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. జగనన్న చిరునవ్వు అణుబాంబు కన్నా శక్తివంతం అంటూ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
తాజాగా నైనా జైస్వాల్.. తూర్పు గోదావరి జిల్లాలో క్రీడా వికాస కేంద్ర ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నది. సీతానగరంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. అక్బర్, విక్రమార్కుడు వంటి రాజుల ఆస్థానంలో నవ రత్నాలు ఉండేవని చరిత్ర చెబుతుంది. ఈ కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం నవ రత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపించింది.
‘‘జగనన్న చిరునవ్వు.. అణుబాంబు కన్నా శక్తివకంతమైనది. ప్రేమ, కరుణ, వాత్సల్యం చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇక క్రీడాకారులను ప్రోత్సాహించడం కోసం ఆయన చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ఎందరికో జీవితాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమాలను ఇలానే విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపింది. నైనా మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక నైనా జైస్వాల్ ప్రతిభ గురించి తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఆమె టాలెంట్ కేవలం టేబుల్ టెన్నిస్‌కే పరిమితం కాలేదు. చదువులోనూ అంతే చురుకు. 8 ఏళ్ల వయసుకే నైనా 10వ తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత 10వ ఏట ఇంటర్, 13 ఏళ్లకు డిగ్రీ, 16 ఏళ్లకే పీజీ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత పీహెచ్‌డీ కూడా చేసి ఆసియాలోనే పీహెచ్‌డీ అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఖ్యాతి పొందింది. రెండు చేతులతో రాయగలగడం, అత్యంత వేగంగా టైపింగ్ చేయడంలోనూ నైనా జైస్వాల్ దిట్ట. ఏడేళ్ల వయసుకే రామాయణ శ్లోకాలు నేర్చుకుంది. చదువు, క్రీడలు మాత్రమే కాక.. నైనా చక్కగా పాటలు పాడుతుంది, పియానో కూడా వాయిస్తుంది. మోటివేషనల్ స్పీకర్ కూడా. ప్రస్తుతం నైనా వయసు 23 ఏళ్లు. తల్లితో కలిసి న్యాయవాద కోర్సులో చేరిన నైనా ఇటీవలే అడ్వొకేట్ గానూ ప్రమాణం చేసింది.