Arjun Suravaram
New Railway line in AP: భారత దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే రవాణ వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న ఈ శాఖ తాజాగా ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఏపీలో కొత్త రైల్వే లైన్ ను ఏర్పాటు చేయనుంది.
New Railway line in AP: భారత దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే రవాణ వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న ఈ శాఖ తాజాగా ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఏపీలో కొత్త రైల్వే లైన్ ను ఏర్పాటు చేయనుంది.
Arjun Suravaram
దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే రవాణ వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. దీని ద్వారా నిత్యం లక్షల మంది తమ గమ్య స్థానానికి చేరుకుంటారు. అలానే టికెట్ ధర తక్కువగా ఉండటంతో రైళ్లల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇక రైల్వే శాఖ కూడా ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. టికెట్ల బుకింగ్ మొదలు, కొత్త రైలు మార్గాల ఏర్పాటు వరకు అనేక చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఏపీ ప్రజలకు రైల్వే శాఖ ఓ శుభవార్త చెప్పింది. కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రవాణ మార్గాల్లో రైల్వే వ్యవస్థ ఒకటి. రాష్ట్రం మొత్తాన్ని కలుపుతూ అనేక రైల్వే లైన్లు ఉన్నాయి. అలానే పెరుగుతున్న రద్దీ దృష్ట్యా, ప్రాంతాల అభివృద్ధితో కొత్త కొత్త రైల్వే లైన్లు కూడా రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. అలానే రైల్వే లైన్లు, ట్రాక్స్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు అనేక చర్యలు తీసుకుంది. తాజాగా ఏపీ ప్రజలకు రైల్వే శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రైల్వే మార్గం ఏర్పాటు చేయడానికి బోర్డు చర్యలు ప్రారంభించింది. పూడి-ఏర్పేడు రైల్వే స్టేషన్ల మధ్య కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ సిద్ధమైంది.
దక్షిణాది నుంచి ఉత్తరాదిలోని ప్రధాన నగరాలకు తక్కువ సమయంలో వస్తు రవాణా చేయడానికి ఈ మార్గం చాలా కీలమైనది. అందుకే రైల్వే బోర్డు పుడి-ఏర్పేడు మధ్య నూతన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి తీసుకుంది. ఇప్పటి వరకు వస్తు రవాణా చేసే గూడ్స్ రైళ్లు పూడి నుంచి రేణిగుంట రైల్వే జంక్షన్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ముంబై, విజయవాడ మార్గాలవైపు వెళ్తుంటాయి.
ఇదే సమయంలో సౌత్ నుంచి నార్త్ ఇండియాలోని ప్రధాన నగరాలకు వస్తువులను రవాణా చేయడానికి తిరుపతి జిల్లాలోని రేణిగుంట రైల్వే జంక్షన్ లో కొంత ఆలస్యం జరుగుతుందని రైల్వే బోర్డు గుర్తించింది. అలానే పుడి, ఏర్పేడు మార్గంలో గూడ్స్ రైళ్లతో పాటు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లల రాకపోకలు కూడా నిర్వహించే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. పూడి నుంచి ఏర్పేడు రైల్వేస్టేషన్ వరకు 27 కిలోమీటర్ల దూరం సర్వే చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ కొత్త మార్గంలో ఓ రైల్వే స్టేషన్ కూడ వస్తుంది. ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే.. రేణిగుంట రైల్వే జంక్షన్‌లో మార్గంలో జరిగే ఆలస్యాన్ని నివారించవచ్చని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా రైళ్ల రాకపోకల విషయంలో రేణిగుంట రైల్వే శాఖపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. చిత్తురూ నుంచి రైతులు పండించే వస్తువులు కూడా దూర ప్రాంతాలకు రవాణా చేసే అవకాశం ఏర్పడనుంది. తాజాగారైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయంతో రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని భారీ పరిశ్రమల ఉత్పత్తులు కూడా రవాణా చేయడానికి అనుకూలంగా స్థానికులు భావిస్తున్నారు. మొత్తంగా రైల్వే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.