iDreamPost
android-app
ios-app

సంక్రాంతి వేళ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..15 నుంచి మళ్లీ ప్రారంభం!

TTD Good News: తిరుమల తిరుపతికి సంబంధించిన సమాచారం కోసం శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలానే టీటీడీ కూడా తరచూ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెబుతుంటుంది. తాజాగా భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ.

TTD Good News: తిరుమల తిరుపతికి సంబంధించిన సమాచారం కోసం శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలానే టీటీడీ కూడా తరచూ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెబుతుంటుంది. తాజాగా భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ.

సంక్రాంతి వేళ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..15 నుంచి మళ్లీ ప్రారంభం!

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక స్వామి వారి సేవలో దర్శించి.. తీర్థ ప్రసాదాలు అందుకుంటారు. స్వామి వారి దర్శనం కోసం కేవలం మన దేశం నుంచి కాకుండా ప్రపంచ దేశాల నుంచి వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే టీటీడీ కూడా భక్తుల సౌకర్యార్థం నిత్యం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇక ఇదే సమయంలో తిరుమలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండగ వేళ టీటీడీ శ్రీవారి భక్తులకు ఓ శుభవార్త చెప్పింది.  మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా…

తిరుమల తిరుపతిలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని మహిమల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తిరుమలకు వెళ్లే భక్తులు సంఖ్యే అందుకు నిదర్శనం. ఇక భక్తుల సౌకర్యార్థాం తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం శ్రీవారికి సంబంధించిన సమాచారం తెలియజేస్తుంది. అలానే తిరుమల దర్శనం, టికెట్స్, గదులు, ఇతర సమాచారాన్ని భక్తులకు తెలియజేస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది. పవిత్రమైన ధనుర్మాసం జనవరి 14వతేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే జనవరి 15 తేదీ సోమవారం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్ల‌వారుజామున 12.34 గంట‌ల‌కు ధనుర్మాస ఘడియలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం ప్రారంభమైంది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికానున్నాయి. అంటే కేవలం మరో రెండు రోజుల్లో ఆ ధనుర్మాస ఘడియాలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో  జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. అదేవిధంగా జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరగనున్నాయి. మరి.. ఈ సదావకాశాన్ని శ్రీవారి భక్తులు  వినియోగించుకునేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి.. టీటీడీ తెలిపిన ఈ శుభవార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.