iDreamPost
android-app
ios-app

సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత!

సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత!

పబ్లిక్ టాయిలెట్ల అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే పేరు..సులభ్. అందుకే ఎక్కడ పబ్లిక్ టాయిలెట్లు కనిపించిన.. అక్కడ సులభ్ పేరు వినిపిస్తోంది. దీని వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్. మంగళవారం ఉదయం ఆయన న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. స్థానిక సమాచారం ప్రకారం.. సులభ్ ఇంటర్నేషనల్ ఆఫీస్ లో ఆయన జాతీయ జెండాను ఎగర వేశారు. అనంతరం కాస్తా అస్వస్థతకు గురయ్యారు. ఈలోపే ఆయన ఆరోగ్యం క్షీణించింది. అక్కడి సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

ప్రజా మూత్రశాలలను నిర్మించడంలో సులభ్ అగ్రగామిగా నిలిచింది. సులభ్ ఇంటర్నేషనల్ ను బిందేశ్వర్ పాఠక్ స్థాపించి వేలాది పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. దీనిద్వారా భారతదేశంలో బహిరంగ మలవిసర్జనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా పాఠక్ ప్రసిద్ధి చెందారు. ఐదు దశాబ్దాలుగా స్వచ్ఛభారత్ నిర్మాణం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ ఉద్యమం ద్వారా పాఠక్ మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మరుగుదొడ్లు నిర్మించుకోలేని లక్షలాది మంది, అలానే మాన్యువల్ స్కావెంజర్లుగా నియమించి కొందరి జీవితాల్లో గణనీయమైన మార్పును తెచ్చిపెట్టింది.

తక్కువ కులాల కారణంగా సమాజంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న చాలామందికి ఆయన ఉపాధిని కల్పించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బ్రాహ్మణ కుటుంబంలో బిందేశ్వర్ పాఠక్ జన్మించారు. చదువు పూర్తయిన వెంటనే, పాట్నాలోని గాంధీ శతాబ్ది కమిటీలో వాలంటీర్‌గా పని చేశారు. సులభ్ కాంప్లెక్స్ నిర్మించి.. దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. మంగళవారం ఉదయం అనారోగ్య కారణంతో ఆయన తుది శ్వాస విడిచారు. సులభ్ ఇంటర్నేషనల్ సెంట్రల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పాఠక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. వెంటనే సిబ్బంది హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ కి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించినా ఆరోగ్యం కుదుటపడలేదు. మధ్యాహ్నం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: వీడియో: వైన్స్ ముందు బీర్ కోసం కొట్టుకున్న యువకులు!