iDreamPost
android-app
ios-app

Success Story: ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇది కదా సక్సెస్!

  • Published Feb 16, 2024 | 12:02 PM Updated Updated Feb 16, 2024 | 12:02 PM

జీవితంలో ప్రభుత్వ ఉద్యోగమే తమ లక్ష్యంగా భావించే వారు ఎంతో మంది ఉంటారు. కానీ, ఒక్కసారి విఫలం అయిన వెంటనే నిరాశ చెందుతారు. కానీ, ఓ యువతి ఐదు సార్లు ఐఏఎస్ సాధించడంలో విఫలం అయినా కూడా.. తన ప్రయత్నాన్ని వదులుకోలేదు. ఆ యువతి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జీవితంలో ప్రభుత్వ ఉద్యోగమే తమ లక్ష్యంగా భావించే వారు ఎంతో మంది ఉంటారు. కానీ, ఒక్కసారి విఫలం అయిన వెంటనే నిరాశ చెందుతారు. కానీ, ఓ యువతి ఐదు సార్లు ఐఏఎస్ సాధించడంలో విఫలం అయినా కూడా.. తన ప్రయత్నాన్ని వదులుకోలేదు. ఆ యువతి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  • Published Feb 16, 2024 | 12:02 PMUpdated Feb 16, 2024 | 12:02 PM
Success Story: ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇది కదా సక్సెస్!

జీవితంలో ఎవరైనా సక్సెస్ అయిన తర్వాత మాత్రమే ఫేమస్ అవుతారు. కానీ, దానికి ముందు వారు పడిన అవమానాలు, ఆటు పోట్లు మాత్రం ఎవరికీ తెలియవు. ఒక్కసారి వారు విజయాన్ని వరించారంటే .. అప్పటివరకు విమర్శించిన వారు కూడా ప్రశంసలు మొదలుపెడతారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాదించాలి అనుకునే వారికీ ఇలాంటి విమర్శలు, ప్రశంసలు ఎదురౌతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ రియల్ లైఫ్ స్టోరీ కూడా ఇటువంటిదే. ఒకరి నిజ జీవిత గాధ తెలుసుకోవడం వలన వారిని అందలం ఎక్కిస్తున్నట్లు కాదు. కానీ, విజయం సాధించే దిశలో ఎంతో మంది ఉన్నారని .. వారు కూడా అటువంటి అవమానాలనే దాటి ఈ స్థాయికి వచ్చారని తెలియజేయడం మాత్రమే. దాని కారణంగా మరో పది మందికి వీరు ఆదర్శంగా నిలుస్తారు. అలానే ఇప్పుడు అనేక రకాల పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేవారికి మనోధైర్యాన్ని ఇచ్చినవారౌతారు. ఇప్పుడు ఒకే ఏడాదిలో సివిల్స్ తో పాటు మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన ఓ యువతి రియల్ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

గుంటూరు జిల్లాకు చెందిన ఈ యువతీ పేరు భవ్య. చదివింది ఇంజనీరింగ్ అయినా కూడా .. తన అడుగులు సమాజానికి సేవ చేసే దిశగా పడ్డాయి. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాంపస్ లోనే జాబ్ ఆఫర్ వచ్చినా కూడా.. ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసి.. ఐఏఎస్ అవ్వాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకుంది ఈ యువతి. ఆ సమయంలో తోటి వారి నుంచి .. ఆత్మీయుల నుంచి ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. అయినా, సరే తన లక్ష్యం నుంచి వెనుక అడుగు వేయలేదు. ఈ క్రమంలోనే ఓ మంచి ఇన్స్టిట్యూట్ లో సివిల్స్ కోసం కోచింగ్ తీసుకుంది. కాస్తా ఈ సబ్జక్ట్స్ మీద పట్టు సారించడానికి ఆలస్యం అయినా కూడా .. పట్టుదలతో తన చదువును కొనసాగించింది. ఈ క్రమంలో ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదు సార్లు ఐఏఎస్ పరీక్షలలో విఫలం అయింది భవ్య. దీనితో మరింత ఆందోళన , ఒత్తిడి ఆమెను మానసికంగా ఎంతో కృంగతీశాయి. మరలా తల్లి తండ్రుల ప్రోత్సాహ .. సహకారాలతో తిరిగి తన పరీక్షలకు ప్రిపేర్ అయింది.

పట్టుదలతో ఆమె పడిన కష్టానికి ప్రతి ఫలంగా.. 2023 నవంబర్ లో ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ కు భవ్య సెలెక్ట్ అయింది. యూపీఎస్సి లో ఆరేళ్ళ పాటు తన జర్నీని కొనసాగించడం అంటే .. పదునైన కత్తి అంచుపైన నడవడమనే చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ పీరియడ్ అఫ్ టైం లో వారికీ ఎంతో మానసిక ఒత్తిడి, తోటి వారి నుంచి కలిగే విమర్శలు ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదురౌతూ ఉంటాయి. అలానే భవ్య కూడా ఒకానొక టైం లో దీనిని వదిలేద్దాం అని చూసిందట .. కానీ, సరిగ్గా అదే సమయంలో గ్రూప్స్ లో ఎంపిడిఓ పోస్ట్ రావడంతో.. ఆ ఉద్యోగాన్ని చేస్తూ.. సివిల్స్ కు ప్రిపేర్ అయింది. ఆ ప్రయత్నంలో 2023 ఆగష్టులో స్పోర్ట్స్ ఆథారిటీ అఫ్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయింది భవ్య. అలానే నవంబర్ లో విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాలలో కూడా భవ్య పేరు ఉండడంతో .. ఆమె చిన్ననాటి కల సాకారం అయింది. ఆరేళ్ళ అందరి ప్రశ్నలకు సరైన జవాబు అందించినట్లుగా.. ఒకే ఏడాదిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన మహిళగా .. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఈ యువతి. మరి, కొన్ని ఏళ్ల పాటు తన కల కోసం ఎన్నో కష్టాలని అధిగమించిన ఈ యువతి సక్సెస్ స్టోరీపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.