iDreamPost
android-app
ios-app

నూజివీడు IIITలో 800 మంది విద్యార్థులకు అస్వస్థత!

  • Published Aug 28, 2024 | 4:02 PM Updated Updated Aug 28, 2024 | 4:02 PM

Nuzvidu IIIT: ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో విచిత్రమై సంఘటన వెలుగు చూస్తుంది. మూడు రోజుల వ్యవధిలో వందల మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు.

Nuzvidu IIIT: ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో విచిత్రమై సంఘటన వెలుగు చూస్తుంది. మూడు రోజుల వ్యవధిలో వందల మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు.

నూజివీడు IIITలో 800 మంది విద్యార్థులకు అస్వస్థత!

ఇటీవల కొన్ని ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలైన సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. దీనికి కారణం నాణ్యమైన ఆహారం అందకపోవడం, కలుషిత నీటిని సేవించడం, దోమలు ఇతర కారణాలు అని అధికారులు చెబుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు త్రిపుల్ ఐటీ‌లో వరుసగా మూడు రోజుల నుంచి విద్యార్థుల అనారోగ్యానికి గురవుతూ ఆగమాగం అవుతున్నారు. దీనికి కారణం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. నిన్న మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన మూడు రోజుల్లో దాదాపు 800 మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

నూజివీడు త్రిపుల్ ఐటీలో గత మూడు రోజులుగా విద్యార్ధులు తీవ్ర జ్వరం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల బాట పడుతున్నారు. దాదాపు 800 మంది విద్యార్థుల వరకు నగరంలో వివిధ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అధికారుల వెల్లడించారు. ఇటీవల ట్రిపుల్ ఐటీ మెస్ లో ఆహారం నాణ్యత సరిగా లేకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. కొంతమంది విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారని, మరికొంత మంది విద్యార్ధులు ఇంజక్షన్లు, మందులు తీసుకొని క్యాంపస్ లోని వసతీ గృహంలో ఉంటున్నారని ఐటీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నామని అన్నారు.

ఇదిలా ఉంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ పిల్లకు ఈ పరిస్థితి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంతో నమ్మకంతో తమ పిల్లల్ని హాస్టల్ కి పంపితే వారి ఆరోగ్యం విషయంలో ఏమాత్రం శ్రద్ద చూపిడచంకపోవడం దారుణం అని విమర్శిస్తున్నారు.  ఇదిలా ఉంటే..  విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని.. ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అంతేకాదు అసలు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందన్న విషయం విచారణ కమిటీ సమర్పించే నివేదికల అధారంగా తెలిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.