iDreamPost
android-app
ios-app

చైతన్య కాలేజ్ విద్యార్థినిపై దారుణం.. తట్టుకోలేక..!

  • Published Mar 29, 2024 | 4:24 PM Updated Updated Mar 29, 2024 | 4:24 PM

ఏపీలోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కాలేజ్ విద్యార్థిని లైంగిక వేధింపులను తట్టుకోలేకపోయింది.

ఏపీలోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కాలేజ్ విద్యార్థిని లైంగిక వేధింపులను తట్టుకోలేకపోయింది.

  • Published Mar 29, 2024 | 4:24 PMUpdated Mar 29, 2024 | 4:24 PM
చైతన్య కాలేజ్ విద్యార్థినిపై దారుణం.. తట్టుకోలేక..!

అందరు విద్యార్థుల్లాగే తానూ బాగా చదివి మంచి స్థాయికి చేరుకోవాలని అనుకుంది. తన పేరెంట్స్​కు మంచి పేరు తీసుకురావాలని తపనపడింది. అయితే ఆమె ప్రయాణం మధ్యలోనే ఆగింది. చదువు నేర్పాల్సిన గురువే ఇతరులతో కలసి లైంగికంగా వేధించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. కాలేజీ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణమైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వైజాగ్ మధురవాడ కొమ్మదిలో చైతన్య కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. లైంగిక వేధింపుల ఈ ఘటనలో తన ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ రాకూడదని ఆ స్టూడెంట్ తన ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వాట్సాప్ చాటింగ్ ద్వారా సూసైడ్ నోట్ కూడా రాసింది.

ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ రూపశ్రీ సూసైడ్ నోట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. తాను చదువుకుంటున్న కాలేజీలో ఫ్యాకల్టీ విద్యార్థులతో చేతులు కలిపి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ లెటర్​లో పేర్కొంది. తనలా చాలా మంది అమ్మాయిలు నిత్యం లైంగిక వేధింపులకు బలవుతున్నారని తెలిపింది. పోలీసులకు కంప్లయింట్ చేస్తే సీక్రెట్​గా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి కుటుంబ పరువును బజారుకీడుస్తామని బెదిరించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సూసైడ్ నోట్​లో బాధిత విద్యార్థిని రాసుకొచ్చింది.

తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి తన తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి శుక్రవారం తెల్లవారుజామున కాలేజీ మీద నుంచి దూకి రూపశ్రీ మృతి చెందిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంలో పీఎంపాలెం సీఐ రామకృష్ణ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. కాలేజీ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ కుమార్తె మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని.. వాళ్లే ఆమెను హత్య చేశారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇక, మృతురాలి ఫోన్ సీజ్ చేసిన పోలీసులు అందులో నుంచి డేటా స్వీకరించారని తెలుస్తోంది. విద్యార్థిని మృతిపై మహిళా సంఘాలు సీరియస్ అవుతున్నాయి. స్త్రీలు, విద్యార్థులు, చిన్నారుల మీద అఘాయిత్యాలకు పాల్పడే వారిని అస్సలు వదలొద్దని, కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.