Dharani
కొన్ని ప్రమాదాలను చూస్తే.. సినిమాలో చూసే స్టంట్‌లే గుర్తుకు వస్తాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ప్రమాదం కూడా సినిమా స్టంట్‌కు ఏమాత్రం తీసిపొకుండా ఉంది. ఆ వివరాలు..
కొన్ని ప్రమాదాలను చూస్తే.. సినిమాలో చూసే స్టంట్‌లే గుర్తుకు వస్తాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ప్రమాదం కూడా సినిమా స్టంట్‌కు ఏమాత్రం తీసిపొకుండా ఉంది. ఆ వివరాలు..
Dharani
నిజ జీవితంలో చూడలేని.. చూడటానికి అవకాశం లేని అనేక సన్నివేశాలను మనం సినిమాల్లో చూడవచ్చు. మరీ ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో వచ్చే కొన్ని సీన్లు చూస్తే.. ఆశ్చర్యంతో పాటు.. వార్ని అసలు రియల్ లైఫ్‌లో ఇలా జరుగుతుందా అనిపించక మానదు. ఈలలు వేయగానే గాల్లో నుంచి సుమోలు దూసుకురావడం, తొడగొడితో రైలు ఆగడం.. హీరో ఒక్క దెబ్బ కొడితో.. విలన్ గాల్లో గింగిరాలు తిరగడం వంటి సీన్లు.. జనాలను ఎంటర్‌టైన్ చేస్తాయి. మరి ఇవే సీన్లు రియల్ లైఫల్‌లో ఎదురైతే.. వామ్మో ఇంకేమన్నా ఉందా.. ప్రాణం పొతుంది. కనీసం ఊహించడానికి కూడా ధైర్యం సరిపోదు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి సినిమాటిక్ స్టంట్‌లు మనకు కనిపిప్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. స్తంభాన్ని ఢీకొట్టిన కంటైనర్.. గాల్లో వేలాడింది. మరి ఇంతకు ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే..
ఈ భీకర ఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో చోటు చేసుకుంది. జమ్ము జంక్షన్ దగ్గర ఉన్న ఫ్లై ఓవర్ మీదుగా వెళ్తోన్న ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. కోల్‌కతా నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదంలో కంటైనర్ లారీ ముందు భాగం ఫ్లై ఓవర్ మీద నుంచి ముందుకు దూసుకు వచ్చి.. అలానే కిందకు వేలాడుతూ మధ్యలో ఆగిపోయింది.
కంటైనర్.. జారి పడిపోకుండా.. ఫ్లైఓవర్ మీద ఆగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికి ఏం కాలేదు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ హైవేపై సినిమాటిక్ స్టైల్లో జరిగిన కంటైనర్ లారీ ప్రమాదాన్ని చూసిన స్థానికులు అవాక్కయ్యారు. ఇక ఈ ప్రమాదంలో కంటైనర్ ముందు భాగం బాగా ధ్వంసమయ్యింది.ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ముప్పు తప్పింది. అలానే వంతెన కింద కూడా ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కంటైనర్‌ని కిందకు దించి.. అక్కడి నుంచి తరలించారు. కంటైనర్ లారీ రక్షణ గోడ దాటుకుని కింద పడితే మాత్రం పెను ప్రమాదమే జరిగేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.ఈ ప్రమాద తీవ్రతకు ఫ్లై ఓవర్ గోడకు ఉన్న సిమెంట్ పలకలు విరిగిపడ్డాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.