ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు.. AP ప్రభుత్వం శుభవార్త! ఇక పాస్ పక్కా!

Plus Inter Students Special Classes: సాధారణంగా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది ఫెయిల్ అయిన విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు.

Plus Inter Students Special Classes: సాధారణంగా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది ఫెయిల్ అయిన విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు.

ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగం సంపాదించి సమాజంలో గొప్ప పొజీషన్ లో ఉండాలని ప్రతి తల్లిదండ్రుల కోరుకుంటారు. అందుకోసం తమ తాహతకు మించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో పిల్లలను చదివిస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల విద్యార్థులు పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకోవడం, ఫెయిల్ కావడం చూస్తూనే ఉంటాయి. తమ తల్లిదండ్రుల కష్టపడి చదివిస్తే.. అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయామని చాలా మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పపడుతుంటారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంటుంది. అయితే ఫెయిల్ అయినంత మాత్రానా చావు పరిష్కారం కాదు.. మళ్లీ పరీక్షలు రాసి పాస్ కావొచ్చు అని విద్యార్థులకు ధైర్యం చెబుతూ ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఇంటర్ ఫలితాలు వచ్చాయి. తాజాగా ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది, అధైర్య పడాల్సిన అవసరం లేదని, అదనపు తరగతులను ఉచితంగా నిర్వహించేందుకు సిద్దమైనట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఏపీలో పాస్ అయిన వారి కన్నా.. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో వారికి సరైన కోచింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 24 వ తేదీ నుంచి జూన్ 1 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఫెయిల్ అయిన విద్యార్థులకు తరగతులు నిర్వహించి.. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్దం చేయాలని విద్యాశాఖ అధికారులకు తెలిపారు. అంతేకాదు ప్రతి రోజు విద్యార్థులకు అటెండెన్స్, చదువు తీరును గుగుల్ ఫాయ్ లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఎంత మేరకు ప్రిపేర్ అవుతున్నారు.. అని పరీక్షలు నిర్వహించి వారిని మరింతగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని అధికారులు తెలిపారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు మానసిక ధైర్యం.. పాస్ అవుతామన్న నమ్మకం కలుగుతుందని.. రిజల్ట్ బాగా వస్తుందని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Show comments