ACB కోర్టుకు చంద్రబాబు.. రిమాండ్‌ రిపోర్టు సమర్పించిన సీఐడీ!

ఏపీలో నిన్నటి నుంచి ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించిన చర్చలే జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టు అయిన టీడీపీ నేత, మాజీ సీఎం చంద్రబాబు ని ఆదివారం ఉదయం 6 గంటలకు సిట్ కార్యాలయం నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం ఏసీబీ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఏసీబీ కోర్టు వద్ద న్యాయవాదుల సందడి కొనసాగుతుంది. 2021 లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదు.. దీంతో కొద్దిసేపటి క్రితమే ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును చేర్చి కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏ37 గా చంద్రబాబును చేరుస్తూ రిమాండ్ రిపోర్టు సమర్పించింది సీఐడీ. ఈ కేసులో రూ.371 కోట్ల కుంభ కోణం జరిగిందని అభియోగం మోపింది.  ఈ రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ లో కర్మ కర్త క్రియ అన్నీ చంద్రబాబు అని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కోర్టు లో వాదనలు ప్రారంభం కాగా, సీఐడీ తరుపు నుంచి ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదిస్తుండగా.. చంద్రబాబు తరుపు నుంచి సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదనులు వినిపిస్తున్నారు. కాగా, కోర్టు లో కొద్ది మంది ఇతర న్యాయవాదులను మాత్రమే అనుమతించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏసీబీ కోర్టు లో వాడీ వేడిగా వాదనలు కొనసాగుతున్నాయి.

ఆ సమయంలో ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ అక్రమాలు పాల్పడినటులు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఓపెన్ కోర్టులోనే వాదనలు జరుగుతున్నాయి. మొదట తన ఛాంబర్ లో వాదనలు వినిపించాలని జడ్జీ కోరగా.. టీడీపీ లీగల్ టీమ్ విజ్ఞప్తి మేరకు కోర్టు హాల్ లోనే వాదనలు మొదలయ్యాయి. ఈ వాదనలు ముగిసిన తర్వాత చంద్రబాబు కి బెయిల్ వస్తుందా? లేదా జైల్ కి వెళ్తారా? అనేది తీవ్ర ఉత్కంఠంగా ఉంది. అంతకు ముందు చంద్రబాబు ని విజయవాడ జీజీహెచ్ కి తరలించి బీపీ, షుగర్, ఛాతి సంబంధిత పరీక్షలు నిర్వహించారు.  కోర్టు ఆవరణలో మీడియా, లాయర్లు ఎవరూ లోపలికి వెళ్లే అవకాశం లేదని తెలుస్తుంది.

Show comments