nagidream
సాధారణంగా వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైనా గానీ కస్టమర్లు డబ్బులు ఎలా సంపాదించారు అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ షాపు యజమాని మాత్రం కష్టపడి సంపాదించిన సొమ్ముతో అయితేనే రండి.. నిజాయితీపరులకు మాత్రమే అమ్ముతాను.. పాపపు సొమ్ముతో నా వస్తువులు కొనకండి అంటూ వినూత్న ప్రచారం చేస్తున్నారు.
సాధారణంగా వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైనా గానీ కస్టమర్లు డబ్బులు ఎలా సంపాదించారు అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ షాపు యజమాని మాత్రం కష్టపడి సంపాదించిన సొమ్ముతో అయితేనే రండి.. నిజాయితీపరులకు మాత్రమే అమ్ముతాను.. పాపపు సొమ్ముతో నా వస్తువులు కొనకండి అంటూ వినూత్న ప్రచారం చేస్తున్నారు.
nagidream
ఏపీలో అలాంటి నోట్లు చెల్లవు. అవును మీరు విన్నది నిజమే. ఎప్పుడో 2016లో డీమానిటైజేషన్ జరిగింది. డీమానిటైజేషన్ పేరుతో కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత 2 వేలు, 500, 200 వంటి నోట్లను ముద్రించింది. ఇక అప్పటి నుంచి పెద్ద నోట్ల రద్దు అనేది జరగలేదు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఒక్క చోట మాత్రం ఆ కరెన్సీ నోట్లు చెల్లవు. రెండు వేల నోట్లు, 500 నోట్లు, 200 నోట్లు, వంద నోట్లు ఏ నోటు అయినా తీసుకెళ్లండి.. కానీ అక్కడ మాత్రం ఆ నోట్లు చెల్లవు. చినిగిన నోట్లు, దొంగ నోట్లు అంటే తీసుకోరని తెలిసిందే. కానీ అక్కడ బాగున్న కరెన్సీ నోట్లు కూడా తీసుకోరు. ఏపీలో ఆ ఒక్క చోటే చాలా స్పెషల్. అక్కడకి అలాంటి నోట్లు తీసుకెళ్తే మాత్రం చెల్లవు.
మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలన్నాక ప్రచారంలో రాజకీయ నాయకులు ఓటర్లకు డబ్బులు ఇస్తారన్న విషయం తెలిసిందే. ఓటర్లు కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులకు అలవాటు పడిపోయారు. డబ్బులిస్తేనే ఓట్లు వేస్తాం అనే పరిస్థితికి జనం దిగజారిపోయారు. అయితే ఇంత దారుణమైన, స్వార్థపూరిత మనుషులున్న సమాజంలో కూడా ఓటుకు డబ్బులు తీసుకోము అనే నిజాయితీ పౌరులు కూడా ఉన్నారు. మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు అని ఖచ్చితంగా ఇంటి గేటుకు ఒక బోర్డు పెట్టేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఇప్పటికే చాలా మందిని చూసాం. అయితే ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో ఓ షాపు యజమాని విచిత్రమైన బోర్డు పెట్టారు.
ఓటు అమ్ముకున్న పాపపు సొమ్ముకి నా షాపులో ఎలాంటి వస్తువులు కొనడానికి వీల్లేదు అంటూ ఒక బోర్డు పెట్టారు. సీతారామ రేడియో స్టోర్ యజమాని మురళీకృష్ణ ఇలా వినూత్నంగా బోర్డు పెట్టారు. ‘ఓటును అమ్ముకున్న ఓ ఓటరన్న. ఓటు అమ్ముకున్న సొమ్ముకి మా షాపునందు వస్తువులు అమ్మబడవు. దయచేసి రాజకీయ నేతలు పంచే అవినీతి సొమ్ము తీసుకుని ఓటు అమ్ముకున్న వ్యక్తులు మా షాపులో వస్తువులు కొనడానికి రావద్దు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే మా షాపుకి రండి. అటువంటి వారికి లాభం లేకుండా నచ్చిన రేటుకే వస్తువులు ఇస్తాం. నీ ఒక్కడి వల్ల సమాజం మారిపోతుందా అని అనుకుని ప్రయోజనం లేదు. చైతన్యం కోసం వై.వి. మురళీకృష్ణ’ అంటూ బోర్డులో రాసి ఉంది.
ఈ ప్రకటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈరోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండడం మంచి విషయమని అంటున్నారు. డబ్బుకి ఓటుని అమ్ముకునే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఆ షాపు యజమాని చేస్తున్న వింత ప్రచారానికి అతన్ని ప్రశంసిస్తున్నారు. మరి పాపపు సొమ్ముతో మా షాపులో వస్తువులు కొనడానికి రావద్దు అని ఖరాఖండిగా చెప్పడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.