iDreamPost
android-app
ios-app

APలో రైలు ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!

AP Trains: తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైల్వేకు సంబంధించిన పనులు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే పలు రైళ్లను మళ్లీంచడం లేదా రద్దు చేయడం చేస్తుంటారు. తాజాగా ఏపీలోని రైలు ప్రయాణికులుకో ముఖ్యమైన గమనిక. జూన్ 1న పలు రైళ్లను రద్దు చేసినట్లు

AP Trains: తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైల్వేకు సంబంధించిన పనులు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే పలు రైళ్లను మళ్లీంచడం లేదా రద్దు చేయడం చేస్తుంటారు. తాజాగా ఏపీలోని రైలు ప్రయాణికులుకో ముఖ్యమైన గమనిక. జూన్ 1న పలు రైళ్లను రద్దు చేసినట్లు

APలో రైలు ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!

ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా వేల కిలోమీటర్ల పొడవును ఈ రైలు మార్గాలు ఉన్నాయి. ఇక రైళ్ల ద్వారా నిత్యం లక్షలాది మంది తమ గమ్య స్థానాలకు చేరుతుంటారు. అలానే సరకులను రవాణ చేయడంలోనూ రైల్వే వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఇలా ఉంటే రైల్వే కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయాణికులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు కూడా కీలక సమాచారం ప్రయాణికులకు అందిస్తుంటారు. తాజాగా ఏపీలోని రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పిందనుకోవాలి. పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైల్వేకు సంబంధించిన పనులు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే పలు రైళ్లను మళ్లీంచడం లేదా రద్దు చేయడం చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం తెలియక స్టేషన్లకు వచ్చి ఇబ్బంది పడుతుంటారు. ఇది ఇలా ఉంటే..తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రైలు ప్రయాణికులుకో ముఖ్యమైన గమనిక. భద్రత, ఆధునికీకరణ పనుల కారణంగా జూన్ 1న పలు రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి సిల్చార్ వెళ్లే 12513 నెంబర్ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

అంతేకాదు సంబల్‌పూర్‌ డివిజన్‌లో పలు రైళ్లు దారి మళ్లించి నడపనున్నట్లు ప్రకటనలో తెలిపారు. వయా విజయనగరం, ఖుర్థారోడ్, కటక్, జాఖాపూర, జరోలి మీదుగా పలు రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. ఇక దారి మళ్లించిన రైళ్ల విషయానికి వస్తే..ఎర్నాకుళం నుంచి టాటా నగర్ వెళ్లే (18190) రైలును జూన్‌ 7 నుంచి 14 వరకు దారి మళ్లించనున్నారు.,  అలానే  టాటా-ఎర్నాకుళం(18189) రైళ్లను జూన్‌ 6 నుంచి 12వ తేదీ వరకు దారి మళ్లీంచనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈనెల 30న రాత్రి 11.40 గంటలకు సంత్రాగచ్చిలో బయలు దేరాల్సిన రైలు ఆలస్యంగా బయల్దేరుతుంది. సంత్రాగచ్చి-తాంబరం(06090) రైలు 3.10 గంటలు ఆలస్యంగా బయలు దేరేలా మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. రైల్వే చేసిన మార్పులకు అనుగుణంగా ప్రయాణికులు జర్నీ ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

మరోవైపు జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ఐఆర్‌సీటీసీ స్పెషల్ రైలు నడుపుతున్న సంగతి తెలిసింది. జూన్‌ 22న సికింద్రాబాద్‌ నుంచి ఈ రైలు బయలుదేరనుంది. అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ఈ రైలు వెళ్తోంది.  అలానే తమిళనాడులోని అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూర్ వెళ్లనుంది.ఇక కేరళలోని తిరుచ్చి, త్రివేండ్రం వెళ్తుంది. ఈ రైలు 30న తిరుగు ప్రయాణమై మళ్లీ అదే స్టేషన్ల మీదుకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రవాణా, హోటల్‌ గదులు, టీ, టిఫిన్, భోజనంతో కలిపి టికెట్టు ధరను నిర్ణయించారు. టికెట్ల బుకింగ్‌తో పాటుగా‌ ఇతర పూర్తి వివరాల కోసం 8287932312 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.