Arjun Suravaram
Schools Holiday In AP: భారీ వర్షాల కారణంగా సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసింది. తాజాగా ఏపీలోని ఓ జిల్లాలలో మంగళవారం కూడా స్కూల్స్ కి హాలీడే ప్రకటంచారు.
Schools Holiday In AP: భారీ వర్షాల కారణంగా సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసింది. తాజాగా ఏపీలోని ఓ జిల్లాలలో మంగళవారం కూడా స్కూల్స్ కి హాలీడే ప్రకటంచారు.
Arjun Suravaram
రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. అనేక ప్రాంతాలు, గ్రామాలు నీట మునిగాయి. ఇక పంటల పొలాలు అయితే సముద్రాన్ని తలపిస్తున్నాయి. నెలరోజులు కురవాల్సిన వాన కేవలం రెండు రోజుల్లోనే పడిందంటే..పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వరదల కారణంగా జరిగిన ఆస్తి నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక పంటలు వరదన నీటిలో కొట్టుకపోవడంతో రైతులు విలవిల్లాడారు. ఇది ఇలా ఉంటే.. వర్షాల నేపథ్యంలో సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసింది. అలానే తాజాగా ఏపీలోని ఓ జిల్లాలో రేపు కూడా స్కూళ్లకు సెలవును ప్రకటించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్టా, గుంటూరు జిల్లాలో అయితే తీవ్ర స్థాయిలో వానలు విజృంభించాయి. విజయవాడ, గుంటూరు నగరాలు నీట మునిగాయి. అనేక కాలనీలు, నగర్ లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బోట్ల ద్వారా బాధితులను బయటకు తీసుకొస్తున్నారు. సోమవారం వరుణుడు కాస్తా శాంతించినా..ఇంకా ముప్పు మాత్రం వదలేదు. గత రెండు రోజుల్లో కురిసిన వాన ప్రభావంతో పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు నీటిమయం అయ్యాయి. అలానే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే మార్గాలు నీటితో ఉన్నాయి. ఇలా భారీ వర్షాల ముప్పు ఇంకా తొలగని నేపథ్యంలో గుంటూరు జిల్లా పరిధిలోని పాఠశాలకు రేపు అంటే సెప్టెంబర్ 3 మంగళవారం కూడా సెలవులు ప్రకటించారు.
భారీ వానల కారణంగా పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. కొన్నిచోట్ల పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరడంతో తరగతులు నిర్వహించేందుకు కూడా వీలులేని పరిస్థితి ఉన్నట్లు సమాచారం. అలానే పలు ప్రాంతాల్లో నదులు పొంగిపొర్లుతున్నాయని, దీంతో రోడ్లు నడవలేని పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో మంగళవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖహెచ్చరికలు, వరద ముప్పుతో ముందు జాగ్రత్తగా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెలవులు ప్రకటించారు. వర్షాలు కురిసే మరికొన్ని జిల్లాల్లోనూ రాత్రిలోగా కలెక్టర్లు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా కురిసిన వానల కారణంగా.. అటు తెలంగాణలో ఇటు ఏపీలో ప్రభుత్వాలు సోమవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసింది. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు సెలవు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అదే సమయంలో అన్ని ప్రభుత్వ వివిధ విభాగాలకు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. అందరూ కచ్చితంగా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.