P Krishna
ఏపీ అభివృద్ది కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది.. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ రంగం అభివృద్ది కోసం కృషి చేస్తున్నారు.
ఏపీ అభివృద్ది కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది.. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ రంగం అభివృద్ది కోసం కృషి చేస్తున్నారు.
P Krishna
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్.. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అన్నిరకాలుగా కృషి చేస్తున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశారు. మనబడి నాడు-నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, విద్యాకానుక ఇలా విద్యావ్యవస్థ మెరుగు పరిచేందుకు ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకువచ్చారు. అలాగే వైద్య రంగంలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ఒకే రోజు 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడం ద్వారా వైద్య విద్యకు సీఎం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది. అన్నదాత విషయంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, పొలాల్లోనే పంట కొనుగోలు, ఉచిత పంట భీమా, ఇన్ పుట్ సబ్సిడీ ఇలా ఎన్నో రకాలుగా రైతులను ఆదుకున్నారు. తాజాగా ఏపీ ప్రజల కోసం జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పలు సందర్భాల్లో సీఎం జగన్ అన్నారు. ఈ క్రమంలోనే వర్చువల్ విధానంలో ఆయన 16 సబ్ స్టేషన్లుకు శంకుస్థాపన, 12 సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం చేశారు. అంతేకాదు పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్‌పిసిఎల్ తో పదివేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై జగన్ సర్కార్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఏపీ విద్యుత్ రంగ చరిత్రలో 28 సబ్ స్టేషన్లకు ఏపీ ట్రాన్స్ కో శ్రీకారం చుట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఏపీ లో రైతులకు తొమ్మిది గంటలు పగటి పూట ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అని.. విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా సిద్దమైనట్లు సీఎం జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చి తొలినాళ్లలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకున్నా కెపాసిటి సరిపోదని అధికారులు వివరించినట్లు జగన్ తెలిపారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం గట్టి సంకల్పంతో ముందుకు అడుగు వేసింది.. పరిస్థితులు అధిగమించేందుకు 1700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి ట్రాన్స్ మిషన్ కెపాసిటీని అభివృద్ది చేసి నేడు రైతుకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచే స్థాయికి ఎదిగామని గర్వంగా చెబుతున్నా అని అన్నారు సీఎం జగన్. ఏపీలో రూ.2.49 కే సోలార్ పవర్ అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని అన్నారు. విండ్, పీఎస్పీ, సోలార్, గ్రీన్ హైడ్రోజన్ పేరుతో కొన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి. రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టులను రూపొందించామని సీఎం జగన్ అన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 1500 మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయని అన్నారు. ఇప్పటికే అవేరా స్కూటర్స్ తయారీ సంస్థ ఏపీలో ఉత్పత్తి ప్రారంభించిందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.