iDreamPost
android-app
ios-app

విజయవాడ దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఆ రోజున ఉచితంగా!

  • Published Aug 05, 2024 | 6:49 PM Updated Updated Aug 05, 2024 | 6:49 PM

శ్రావణ మాసం ప్రారంభమైన సందర్భంగా.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న దుర్గమ్మను ఈనెల 16వ తేదిన వరలక్ష్మీ దేవి అమ్మవారుగా అలకంరించనున్నమని ఆలయ ఈవో రామారావు  తాజాగా భక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా.. విజయవాడ దుర్గమ్మను

శ్రావణ మాసం ప్రారంభమైన సందర్భంగా.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న దుర్గమ్మను ఈనెల 16వ తేదిన వరలక్ష్మీ దేవి అమ్మవారుగా అలకంరించనున్నమని ఆలయ ఈవో రామారావు  తాజాగా భక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా.. విజయవాడ దుర్గమ్మను

  • Published Aug 05, 2024 | 6:49 PMUpdated Aug 05, 2024 | 6:49 PM
విజయవాడ దుర్గమ్మ భక్తులకు  గుడ్‌న్యూస్.. ఆ రోజున ఉచితంగా!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రల్లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కూడా ఒకటి. ఇక ఈ ఆలయం ఇంద్రకీలాద్రి కొండపై వెలసి ఉంది. అయితే ఈ పుణ్యక్షేత్రనికి కూడా తరుచు ఎంతోమంది భక్తులు సందర్శిస్తూంటారు. అలాగే ఆ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను తీర్చుకుంటుంటారు.ఇకపోతే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు కానీ, శ్రావణ మాసా పూజలు కానీ చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. అయితే ప్రస్తుతం శ్రావణ మాసం ప్రారంభం కావడంతో.. విజయవాడ లోని దుర్గమ్మను సాక్ష్యత్తు లక్ష్మీ స్వరూపినిగా పూజలు అందుకుంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా విజయవాడ దుర్గమ్మను ఈనెల 16వ తేదీన వరలక్ష్మీ దేవిగా అలంకరిస్తారని ఆలయ ఈవో తాజాగా పేర్కొన్నారు. అంతేకాకుండా.. దుర్గమ్మ సన్నిధిలో   భక్తలు ఉచితంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని ఆలయ ఈవో తెలిపారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

శ్రావణ మాసం ప్రారంభమైన సందర్భంగా.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న దుర్గమ్మను ఈనెల 16వ తేీన వరలక్ష్మీ దేవి అమ్మవారుగా అలకంరించనున్నమని ఆలయ ఈవో రామారావు  తాజాగా భక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా.. ఇంద్రకీలాదిపై వెలసిన దుర్గమ్మ సన్నిధిలో ఈనెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తున్నమని ఇందులో భక్తులు కూడా పాల్గొనవచ్చని తెలిపారు.  అలాగే ఈ వ్రతంలో పాల్గొన్న భక్తులు ముందుగా దరఖాస్తులు ఇవ్వాలని ఈవో ఆదేశించారు. ముఖ్యంగా ఈనెల 17 నుంచి 21 వరకు పూర్తి చేసిన దరఖాస్తులను ఆలయలో అందజేయాలని భక్తులకు సూచించారు. ఒకవేళ ఆలయంలో ఆర్జిత వరలక్ష్మీ వ్రతం కావాలంటే.. ఒక్కో టికెట్‌ రూ.1500గా నిర్ణయించినట్లు తెలియజేశారు.

ఇకపోతే ఈనెల 23న ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆర్జిత వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తామని, ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారని తెలిపారు. కనుక ఈ విషయాలను భక్తులు గమనించి వ్రత ఆసక్తి కలిగినవారు వెంటనే దరఖాస్తూ చేసుకోవాలని ఈవో తెలిపారు. ఇదిలా ఉంటే.. మరోవైపు విజయవాడ ఆలయంలో ఈనెల 18 నుంచి 20 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఈవో ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే.. ఈ నెల 17 (శనివారం)న సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతిని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని, అలాగే  18 (ఆదివారం)న వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం అనంతరం మూలవిరాట్‌తో పాటు ఉపాలయాల్లోని విగ్రహాలకు పవిత్ర ధారణ చేస్తారని ఈవో తెలిపారు.

ఇక అదే రోజు ఉదయం 9 గంటలకు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులను దర్శనానికి అనుమతి ఉంటుదన్నారు. అలాగే ఈ నెల 19 (సోమవారం)న మూలమంత్ర హవనాలు, వేద పారాయణ నిర్వహిస్తారని,  20 (మంగళవారం)న ఉదయం 8 నుంచి 10గంటల వరకు మండపారాధన, సర్వప్రాయశ్చిత్త శాంతిపౌష్టిక హోమాలను జరుగుతాయని, అయితే అదే రోజు ఉదయం 10.30గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో అన్నారు. మరీ, భక్తులకు ఈనెల విజయవాడలో దుర్గమ్మ సన్నిధిలో ఉచితంగా వరలక్ష్మీ వ్రతం చేసుకునే అవకాశం కల్పించటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.