TDP, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు: సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy: టీడీపీ, జనసేన ప్రకటించిన తొలిజాబితాపై వైఎస్సార్ సీపీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన సలహదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా స్పందించారు. పవన్, చంద్రబాబులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Sajjala Ramakrishna Reddy: టీడీపీ, జనసేన ప్రకటించిన తొలిజాబితాపై వైఎస్సార్ సీపీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన సలహదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా స్పందించారు. పవన్, చంద్రబాబులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

శనివారం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడి నివాసంలో టీడీపీ, జనసేన తొలి జాబితా విడుదలైంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి 118 స్థానాలతో తొలి జాబితాను విడుదల చేశారు. అందులో 94 స్థానాలు టీడీపీకి కేటాయించగా, 24 స్థానాల్లో జనసేనకు కేటాయించారు. జనసేనకు కేటాయించిన 24 స్థానాల్లో కేవలం ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. ఇక టీడీపీ, జనసేన జాబితాపై వైఎస్సార్ సీపీ నేతలు ఓ రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరిస్థితి దయనీయంగా ఉందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.ఈ క్రమంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ చూస్తే  జాలేస్తుందని, జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అలాగే ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల వ్యాఖ్యానించారు. పొలిటికల్‌ పార్టీ నడిపే లక్షణాలు పవన్‌కు లేవని, అత్యంత దయనీయ స్థితిలో పవన్‌ ఉన్నారని సజ్జల అన్నారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్‌ చేస్తారా?,  సొంతంగా బలం లేదని పవన్‌ ఒప్పుకుంటున్నారని సజ్జల తెలిపారు. పవన్‌ కంటే ఆయన జనసైనికులను, ఆయన అభిమానులను చూస్తే జాలేస్తోందని, చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇస్తున్నాడో పవన్‌ చెప్పలేకపోతున్నాడని విమర్శించారు. తాను పోటీ చేసే స్థానంపైన కూడా పవన్‌కు క్లారిటీ లేదని సజ్జల దుయ్యబట్టారు.

చంద్రబాబు ఓ పక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారని, మరోవైపు పవన్ ను పూర్తిగా మింగేశాడని సజ్జల చెప్పొకొచ్చారు. పవన్ కల్యాణ్ సొంత పార్టీని వదిలేసి టీడీపీ ఉపాధ్యక్షుడో, రాష్ర అధ్యక్షుడిగానో ఉంటే సరిపోయేదని అనిపిస్తోందన్నారు. చంద్రబాబును నమ్మి పవన్ వెనుకున్న ఓట్లు రావేమోనని జనసేన అలానే పెట్టి డ్రామా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. 24 మందిని పెట్టుకుని పవన్ కల్యాణ్ ఎవరి మీద యుద్ధం చేస్తాడ?, ఆ 24 మంది అభ్యర్థులు కూడా ఎవరో తెలియక ఎవరి మీద యుద్ధం చేస్తాడు? అంటూ  సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

ఇదే సమయంలో టీడీపీపై కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న టీడీపీ 175 స్థానాలకు  అభ్యర్థులను ప్రకటించుకోలేని దుస్థితి చంద్రబాబుదని అన్నారు.  జగన్ గారికి ఉన్న పాజిటీవిటీని కొద్దిగైనా తగ్గించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. సకల శక్తులు కూడగట్టుకుని మమ్మల్ని ఢీకొట్టాలని చూస్తున్నారని, వారు దింపుడుకల్లం ఆశలా ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా బీజేపీలో ఉన్న చంద్రబాబు ఏజెంట్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రౌడీలు ఎవరో, ప్రజల సంక్షేమాన్ని అందించేంది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.

జనం గొర్రెల్లా నమ్ముతారు అనుకుని చంద్రబాబు ఏదైనా మాట్లాతాడు. కానీ ప్రజలు వారి పరిపాలన చూశారు, జగన్‌ గారి పరిపాలన కూడా చూశారు, వారికి తెలుసు ఎవరికి అండగా నిలబడాలనేది అని రామకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేనాలు సోషల్‌ ఇంజినీరింగ్‌లో మరగుజ్జులుగా మిగిలిపోవాల్సిందే అంటూ సజ్జల సెటైర్లు వేశారు. మరి.. టీడీపీ, జనసేన జాబితాపై  సజ్జల చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments