Arjun Suravaram
Sajjala Ramakrishna Reddy Comments On Sharmila: ఆదివారం ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఆమె..వైసీపీ ప్రభుత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Sajjala Ramakrishna Reddy Comments On Sharmila: ఆదివారం ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఆమె..వైసీపీ ప్రభుత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులను ప్రకటించే విషయంలో మిగతా పార్టీల కంటే చాలా ముందు ఉన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ టీడీపీ అయితే తన గెలుపు సంగతి పక్కన పెట్టి..వైసీపీని ఓడించడమే లక్ష్యంగా వెళ్తోంది. తాను గెలవకున్న పర్లేదు..పక్కవాడు మాత్రం గెలవకూడదనే దానిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నాడు. అందుకే సీఎం జగన్ పై అనేక కుట్రలు, విష ప్రచారాలు చేస్తున్నాడని పొలిటికల్ సర్కిల్ టాక్ వినిపిస్తోంది. అలా చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిల వచ్చిందని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు, షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఎలా సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. అలాగే ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని సజ్జల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి ఎంతో అన్యాయం చేసిందన్నారు. షర్మిల వాడే భాష, యాస సరిగ్గాలేదని, అలా మాట్లాడటం సరికాదని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధతతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. వైఎస్సార్ వారసుడిగా సీఎం జగన్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని, వైఎస్సార్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. ఇదే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని ఆయన తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌పై పెట్టిన కేసులని అక్రమమని గులాం నబీ ఆజాదే చెప్పారని సజ్జల వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి ఎంతో సేవలు చేస్తే.. చివరకు వైఎస్సార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్ నని ఆయన అన్నారు.
ఏపీ పీసీసీ ఛీప్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలై సజ్జల గట్టి కౌంటర్ ఇచ్చారు. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. షర్మిల.. ఇప్పటి దాకా తెలంగాణలో ఉండి.. అక్కడి నుంచి ఎందుకు హఠాత్తుగా వచ్చారని ఆయన ప్రశ్నించారు.ఆ పార్టీ తరఫున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారని అడిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదు?. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు పోటీ చేయలేదని సజ్జల ప్రశ్నించారు.
షర్మిల ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి అస్త్రంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసు ఆయన అన్నారు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడేని, అందుకే ఆ వర్గానికి చెందిన మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుందని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని సజ్జల తెలిపారు. చంద్రబాబు తన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైఎస్ జగన్ రాజీ పడరని ఆయన తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని, గతంలో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయని గుర్తు చేశారు. అలానే తెలుగు దేశం పార్టీ వెంటిలేటర్ పై ఉందని అన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మకై ఆనాడు ఏపీకి అన్యాయం చేశాయని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగుతూనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్చలో పెట్టలేదు. ఈ విషయంపై షర్మిల కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంతో సఖ్యతగా ఉండి సీఎం జగన్ రాష్ట్రానికి మేలు చేస్తున్నారని, చివరగా వైఎస్సార్ తనయురాలిగా, వైఎస్ జగన్ చెల్లెలిగా షర్మిలను అభిమానిస్తామని సజ్జల చెప్పుకొచ్చారు. మరి.. వైఎస్ షర్మిలపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.