Arjun Suravaram
Sajjala Ramakrishna Reddy: గురువారం ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షర్మిల చేసిన ప్రతి మాటకు సమాధానం చెప్పాలి ఉందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, కాంగ్రెస్ లపై సజ్జల ఫైర్ అయ్యారు.
Sajjala Ramakrishna Reddy: గురువారం ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షర్మిల చేసిన ప్రతి మాటకు సమాధానం చెప్పాలి ఉందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, కాంగ్రెస్ లపై సజ్జల ఫైర్ అయ్యారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. ఎన్నికలు లేకున్నా… ఆ స్థాయిలోనే ఎప్పుడూ పొలిటికల్ హీట్ ఇక్కడ కనిపిస్తోంది. మరికొద్ది నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ మరోసారి సీఎం అవుతారంటూ పలు సర్వేలు స్పష్టం చేశాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష చంద్రబాబు..తాను గెలవకున్న పర్లేదు కానీ..జగన్ గెలవకూడదనే ధోరణిలో కుట్రలు చేస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ కుటుంబం నుంచి షర్మిలను ఏపీ పీసీసీ ఛీప్ గా నియమించిది. ఆమె పీసీసీ బాధ్యతలు చేపట్టగానే అధికార వైసీపీపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం ప్రారంభించింది. ఇక ఆమె చేస్తోన్న ఆరోపణలను వైసీపీ నాయకులు ధీటుగా తిప్పికొడుతున్నారు. గురువారం షర్మిల చేసిన వాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
గురువారం ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా మాట్లాడారు. ఈ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ లపై కూడా ఓ రేంజ్ లో మండిపడ్డారు. వైఎస్ కుటుంబంపై కాంగ్రెస్, చంద్రబాబులు కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. షర్మిలకు ఏపీ రాజకీయాలపై అవగాహన లేదని, ఆమె చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే చదుతున్నారని సజ్జల అన్నారు. ఆమెకు వైఎస్ కుటుంబం, జగన్ సోదరి అనే కారణంతోనే పీసీసీ పదవి ఇచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే వైఎస్సార్ సీపీపై షర్మిల మాటల దాడి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆమె ఇప్పటి వరకు తెలంగాణలో ఉండి హఠాత్తుగా ఏపీలో అడుగు పెట్టారని, రావటమే వైఎస్సార్ సీపీపై వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ పథకాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని ఎంతగా వేధించిందో షర్మిలకు కూడా తెలుసని ఆయన అన్నారు. ఆమెకు జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలని, ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా? అని సజ్జల ప్రశ్నించారు. ఇక షర్మిల జగన్ ను విమర్శించిన రోజే ఎల్లో మీడియా భూజనా వేసుకుంటోంది.
“ఎల్లో మీడియా ఏనాడైనా అంతకుముందు ఎందుకు షర్మిల గురించి గొప్పగా రాయలేదు. వైఎస్సార్ గురించి ఆర్కే ఇష్టానుసారం మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? . ఇవ్వన్నీ షర్మిలకు ఎందుకు కనపడలేదు అంటూ సజ్జల ప్రశ్నించారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది” అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం ఓ ప్లాన్ ప్రకారం షర్మిలను చంద్రబాబు తీసుకొచ్చారని సజ్జల తెలిపారు. చంద్రబాబుకు ఎంత అవసరమో అంతే షర్మిల మాట్లాడతారని, అంతకంటే ఎక్కువ మాట్లాడితే బాబు ఒప్పుకోడని సజ్జల పేర్కొన్నారు. తన పరిపాలన గురించి సీఎం జగన్ మాట్లాడితే.. దానిని ఎల్లో మీడియా వక్రీకరించిందని సజ్జల మండిపడ్డారు. మరి.. షర్మిలపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.