iDreamPost
android-app
ios-app

ముందస్తు ఎన్నికలపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. షర్మిల పార్టీ మార్పుపై కూడా..

ముందస్తు ఎన్నికలపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. షర్మిల పార్టీ మార్పుపై కూడా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం వాడీవేడీగా ఉంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో రాజకీయ రచ్చ కొనసాగుతుంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రచ్చ పతక స్థాయికి చేరుకుంది. ప్రతిపక్షాలు దూకుడు పెంచి.. అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు రానున్నట్లు.. జనసేన, టీడీపీ పార్టీల నాయకులు చెప్తున్నారు. నిజమే కావచ్చను కూడా చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.

సూర్యుడి వేడి తగ్గిన ఏపీలో మాత్రం రాజకీయ వేడి ఇంకా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలపై తెగ చర్చ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని సజ్జల స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వైసీపీకి  లేదని స్పష్టం చేశారు. త్వరలో ముందస్తు ఎన్నికలు రానున్నట్లు కొన్ని మీడియా ఛానెళ్లు తెగ హడావుడి చేస్తున్నాయన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటామని, మళ్లీ సీఎంగా  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావాలని ప్రజలు కోరుకుంటునట్లు సజ్జల తెలిపారు.  సీఎం జగన్ పూర్తిగా పాజిటీవ్ ఓటునే నమ్ముకున్నారని, ముందస్తు ఎన్నికలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని  అన్నారు.

ఇంకా సజ్జల మాట్లాడుతూ..” కొన్ని రాజకీయ పార్టీలకు వత్తాసు పలికే మీడియా ఛానెళ్ల హడావుడి మాత్రమే. ముందస్తు ఎన్నికలపై ఎల్లోమీడియాలో రాసుకుని మమ్మల్ని వివరణ అడిగితే ఎలా ?. ఇది కేవలం చంద్రబాబు చేసే ప్లాన్ మాత్రమే. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి బాగా అందుతున్నాయి. అందుకే ప్రజలు మాపై సానుకూలంగా  ఉన్నారు. ఇటీవలే  ఓ జాతీయ మీడియా చేసిన సర్వేలో కూడా వైఎస్సార్ సీపీ కి అనుకూలంగా వచ్చింది” అని సజ్జల పేర్కొన్నారు. అలానే షర్మిల పార్టీ మార్పు వ్యవహారాలపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఒకసారి పార్టీ పెట్టాక అదంతా ఆమె వ్యక్తిగత ఇష్టమేనని ఆయన తెలిపారు. ఆమె నిర్ణయం ఆమెదేనని, తాము అందులో జోక్యం చేసుకోబోమని సజ్జల అన్నారు. మరి.. సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.