iDreamPost
android-app
ios-app

Rushikonda: వీడియో: కాంతులతో విరజిల్లుతున్న రుషికొండ పర్యాటక భవనాలు!

రుషికొండపై ఏపీ ప్రభుత్వం పర్యాటక భవనాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా వాటిని ప్రారంభించారు. తాజాగా కాంతులతో విరజిల్లుతున్న రుషికొండ పర్యాటక భవనాలకు సంబంధించిన వీజివల్స్ బయటకు వచ్చాయి.

రుషికొండపై ఏపీ ప్రభుత్వం పర్యాటక భవనాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా వాటిని ప్రారంభించారు. తాజాగా కాంతులతో విరజిల్లుతున్న రుషికొండ పర్యాటక భవనాలకు సంబంధించిన వీజివల్స్ బయటకు వచ్చాయి.

Rushikonda: వీడియో: కాంతులతో విరజిల్లుతున్న రుషికొండ పర్యాటక భవనాలు!

ఇటీవలే రుషికొండ ప్రాజెక్ట్ ప్రారంభమైన సంగతి తెలిసింది. రుషికొండపై ఏపీ పర్యాటక శాఖ 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పర్యాటక భవనాలను మంత్రి రోజా ప్రారంభించారు. ఇక ప్రారంభోత్సవం నేపథ్యంలో కొండ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, అలానే ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎంతో అట్టహాసంగా రిషికొండ పర్యటాక భవనాల ప్రారంభోత్సవం జరిగింది. తాజాగా విద్యుత్ కాంతుల్లో విరజిల్లుతున్న రుషికొండ పర్యాటక భవనాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం  రుషికొండపై పర్యాట భవనాల నిర్మాణం చేపట్టింది. చాలా రోజుల నుంచి ఈ  నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే పూర్తై గురువారం ప్రారంభోత్సవం జరిగింది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ భవనాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ భవనాలకు సంబంధించిన విజువల్స్ బయటకి రాలేదు. అయితే తాజాగా విద్యుత్ కాంతులతో విరాజుల్లుతున్న రుషికొండ పర్యాటక భవనాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. డ్రోన్ నుంచి తీసిన విజువల్స్ వీడియో షాట్స్ ని సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోన్నాయి. రాజమందిరాన్ని తలపించేలా ఈ నిర్మాణాలు ఉన్నాయి. విద్యుద్దీప లైట్లతో ఈ భవనాలు వెలిగిపోతున్నాయి. ఈ భవనాలను అత్యాధునికంగా  నిర్మించారు. వైజాగ్ ది సిటీ ఆఫ్ డెస్టినీ అంటూ రిలీజ్ చేసిన ఈ భవనాలు.. వాటి అందాన్ని రెట్టింపు చేశాయి. ఈ వీడియో షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆదరణ పొందడం విశేషం. విశాఖలో ఇలాంటి భవనాలు ఉండడం గ్రేట్ అని నెటిజన్లు అంటున్నారు. మరి.. ఈ వీడియోలపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.