iDreamPost
android-app
ios-app

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త!

  • Published Jan 02, 2024 | 10:16 AM Updated Updated Jan 02, 2024 | 10:16 AM

ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా పనిచేసే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ తెలిపింది. వారి సెలవులకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.

ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా పనిచేసే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ తెలిపింది. వారి సెలవులకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.

  • Published Jan 02, 2024 | 10:16 AMUpdated Jan 02, 2024 | 10:16 AM
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త!

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఏడాది సెలవులకు సంబంధించిన వివరాలు ముందుగానే వెల్లడిస్తుంటారు. దీన్ని బట్టి ఉద్యోగస్తులు సెలవులను ఏ విధంగా వాడుకోవాలన్నది ముందుగానే ప్రణాళికల ఏర్పాటు చేసుకుంటారు. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులపై పని ఒత్తిడి లేకుండా ప్రత్యేక సెలవులు కూడా ఇస్తుంటారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఓ శుభవార్త అందజేసింది.. ఇకపై ఏడాదికి ఐదు రోజులు సెలవులుగా పేర్కొంటు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు ఎంతో సంతోషంలో ఉన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగుల విషయంలో ఈ నిర్ణయం హర్షనీయం అంటున్నారు ఉద్యోగులు. వివరాల్లోకి వెళితే..

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్రైవర్లు, కండక్టర్లు, ఆపరేషన్ విభాగం, డిపో గ్యారేజీల్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయిస్ కి ఈ ఏడాది 5 రోజులు సెలవులుగా పేర్కొంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రిపబ్లిక్ డే, అంబేద్కర్ జయంతి, మే డే, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి రోజున సెలవులుగా పేర్కొన్నారు. ఇక జోనల్ వర్క్ షాపులు, టైర్ రీ ట్రెడింగ్, స్టోర్స్ లో పనిచేసే ఉద్యోగులకు 21 సెలవులు ప్రకటించింది. ఇక ఆయా జోన్స్‌ని బట్టి అక్కడి ఎంప్లాయిస్ కి 15 రోజులు సెలవులు వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని పేర్కొంది.

good news for tsrtc employees

ఇదిలా ఉంటే.. జర్నలిస్టులకు ఏపీఎస్ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అక్రిడేటెడ్ ఉన్న విలేకరులకు ఇచ్చిన రాయితీ బస్ పాస్ లను గడువును పెంచినట్లు తెలిపింది. గతంలో ఉన్న గడువును పెంచుతున్నట్లుగా ఆర్టీసీ తెలిపింది.  జర్నలిస్టులకు ఇచ్చిన రాయితీ బస్ పాసుల గడువును 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. సాధారణంగా జర్నలిస్టుల బస్ పాస్ గడువు డిసెంబర్ 31 లోపు ముగిసిపోతుంది. ఈ గడువు తేదీని పెంచాలని ఆర్టీసీని జర్నలిస్టులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాయితీకి సంబంధించిన బస్ పాస్ లను వ్యాలిడిటీని పెంచాలని రాష్ట్ర సమాచార శాఖ వారు ఏపీఎస్ఆర్టీసీని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బస్ రెన్యువల్ చేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎస్ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.