iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ డైలాగ్‌తో అసెంబ్లీ‌లో CBNపై రోజా సెటైర్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో కీలక మలుపులు తీసుకున్నాయి. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. నైపుణ్యాభివృద్ధి కుంభకోణం కేసులో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో కీలక మలుపులు తీసుకున్నాయి. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. నైపుణ్యాభివృద్ధి కుంభకోణం కేసులో

రజినీకాంత్ డైలాగ్‌తో అసెంబ్లీ‌లో CBNపై రోజా సెటైర్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో కీలక మలుపులు తీసుకున్నాయి. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. నైపుణ్యాభివృద్ధి కుంభకోణం కేసులో అరెస్టైన నాటి నుండి అధికార వైసీపీ నేతలు వాగ్భాణాలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీంతో చంద్రబాబు, ఆయన చేసిన అవినీతిపై అసెంబ్లీ సాక్షిగా ఏకరువు పెడుతున్నారు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. తాజాగా ప్రతిపక్షాలనుద్దేశించి అసెంబ్లీలో వైసీపీ పర్యాటక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా.. రజనీకాంత్ స్టైల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారికతను ఉద్దేశించి అసెంబ్లీలో జరిగిన చర్చలో రోజా మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో గత నాలుగున్నరేళ్లల్లో మహిళలకు దక్కుతున్న అవకాశాలను చూస్తే.. దేవతలంతా మూకుమ్మడిగా జగనన్నను ఆశీర్వదించి ఏపీకి ముఖ్యమంత్రిగా పంపించారనిపిస్తుందని అన్నారు.

రాబోయే ముప్పై ఏళ్లలో ఏపీ తలరాతను మార్చే టార్చ్ బేరర్ దొరికారని, అది ఈ రోజు రుజువైందని అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు.  ప్రతి పథకంలో మహిళలకు జగనన్న అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. గర్భంలో ఉన్న ఆడపిల్ల నుండి వృద్దాప్య మహిళ వరకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం జగన్ సర్కారేనని పేర్కొన్నారు. మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాన హక్కులు కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న అని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తిన రోజా.. మహిళా సాధికారికత మాట్లాడేటప్పుడు గత, ఇప్పుడు మధ్య తేడాను పరిశీలించాలని అన్నారు. ‘చంద్రబాబు ఆయనకే వారెంటీ లేదు.. వారెంట్లు తీసుకుని ఈ మధ్య లోపలికి(జైలుకు) వెళ్లాడు. మొన్నటి వరకు భవిష్యత్తుకు గ్యారెంటీ, బాబుది ష్యూరిటీ అంటూ ప్రచారం చేశారు. ఆయనకు, ఆయన హామీలకు భవిష్యత్తులు లేదు. రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఉన్న చంద్రబాబుకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. ప్రతిసారి నాది 40 సంవత్సరాలు అంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే మీరు 40 సంవత్సరాల్లో చేయలేనిది, 40 నెలల్లో చేశారు మా జగనన్న. చంద్రబాబు చీటర్, మా జగనన్న లీడర్’అంటూ వ్యాఖ్యానించారు.

సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళలకు ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని, అందుకు సీఎంగా జగన్ ఉండటం కారణమని అన్నారు. చంద్రబాబును ఇక ఎప్పటికీ మహిళలు నమ్మరు అని పేర్కొన్నారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని, తెలుగు మహిళా ద్రోహుల పార్టీ అని అర్థమైందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తూ చేసిన బిల్లుకు టీడీపీ నేతలు అసెంబ్లీకి రాకపోవడం బట్టి చూస్తే.. వారు మహిళా వ్యతిరేకులని తెలిపారు. ‘ఒకరేమో జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాను అన్నారు. ఈ రోజే ఆయన్నే (చంద్రబాబు) జైలుకు పంపారు. ఇంకేడేమో(లోకేష్) జగన్ కు భయం ఎలా ఉంటుందో చూపిస్తునన్నాడు. ఆ స్టేట్ మెంట్లు ఇచ్చినోడు భయంతో ఈ రోజు స్టేట్ వదిలి ఢిల్లీ పారిపోయాడు. జగనన్నను ఇంటికి పంపిస్తాను, పార్టీని లేకుండా చేస్తానన్నా వాళ్లకు ఒక్కటే చెబుతున్నా..జగనన్న కంట్లో భయముండదు. జగనన్నఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగు ఉండదు. అర్థమైందా రాజా’ అంటూ రజనీ డైలాగ్ వర్షన్ లో చెప్పారు.