iDreamPost
android-app
ios-app

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. TSRTC బస్సు బోల్తా!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే నెల్లూరు జిల్లాలో కావలి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. తాజాగా కాకినాడ జిల్లాలో టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే నెల్లూరు జిల్లాలో కావలి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. తాజాగా కాకినాడ జిల్లాలో టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. TSRTC బస్సు బోల్తా!

ఘోర రోడ్డు ప్రమాదం, రక్తమోడిన రహదారులు, తృటిలో తప్పిన ప్రమాదం.. ఇవి ఏంటి అనుకుంటున్నారా?. నిత్యం న్యూస్ పేపర్లలో, టీవీల్లో వినిపిస్తోన్న వార్తలు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. మద్యం తాగి, అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఎంతో జాగ్రత్తగా ఉండే ఆర్టీసీ బస్సులు సైతం పలు సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతాయి. కొన్ని ఘటనల్లో భారీ ప్రాణ నష్టం జరుగుతుండగా, మరికొన్ని ఘటనల్లో తృటిలో పెను ప్రమాదాలు తప్పుతుంటాయి. తాజాగా కాకినాడ జిల్లాలో టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని కత్తిపూడి హైవేపై ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ప్రమాదకరంగా నిలిచిపోయింది. ఆ బస్సు డ్రైవర్ భాస్కర్ రావుకు బీపీ డౌన్ కావడంతో నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. బోల్తా పడిన బస్సును స్థానికులు గమనించి..వెంటనే అక్కడి చేరుకున్నారు. బస్సులో గాయపడిన వారిని స్థానికులు బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్ లో స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆ బస్సు బలంగా కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టి పక్కకు పడిపోయింది. అదే సమయంలో కరెంట్ పోల్ కూడా వంగిపోయి, తీగలు బస్సుకు సమీపంలోకి వెళ్లాయి. అయితే  ఆబస్సుకు కరెంట్ తీగలు తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ బస్సుకు విద్యుత్ తీగలు తాకి ఉంటే, ఘోరం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో ప్రయాణికులు, అధికారులతో పాటు అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అన్నవరం ఎస్సై కిశోర్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఘోర  ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. రెండు లారీలు ఢీకొన్న క్రమంలో ఒకటి వెళ్లి..ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు డ్రైవర్లతో సహా మరో నలుగురు మృతి చెందారు.  మరి.. ఇలా రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.