iDreamPost
android-app
ios-app

ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందంపై దూసుకెళ్లిన బొలెరో!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన జ్ఞాపకం. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని యువత కోరుకుంటారు. అయితే కొన్ని సార్లు సంతోషంగా సాగే పెళ్లి వేడుకలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన జ్ఞాపకం. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని యువత కోరుకుంటారు. అయితే కొన్ని సార్లు సంతోషంగా సాగే పెళ్లి వేడుకలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందంపై దూసుకెళ్లిన బొలెరో!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని యువత భావిస్తోంది. అలా ఎంతో మంది తమ పెళ్లిన బంధువులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక పెళ్లి వేడుకలో సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా పెళ్లి వేడుకతో వధువరుల కుటుంబాలు సంతోషంలో మునిగిపోతాయి. అయితే కొన్ని పెళ్లి వేడుకల్లో విషాధాలు నెలకొంటున్నాయి. తాజాగా ఓ పెళ్లి కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో శనివారం అర్ధరాత్రి వివాహ ఊరేగింపు కార్యక్రమం జరుగుతోంది.  దీంతో వధువరులను చూసేందుకు చుట్టుపక్కల వారు, గ్రామలోని వారు రోడ్డు వద్ద గుమ్మిగూడారు. ఇక ఆ ఊరేగింపులో వధువరుల స్నేహితులు, బంధువులు సందడి చేశారు. ఇలా సంతోషంగా గడుపుతున్న క్షణాల్లో విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు సమయంలో అక్కడే కొందరు రోడ్డు దాటుతున్నారు.  అదే సమయంలో కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఒక్కసారిగా వారి మీదకు దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.  ఇక ఈ ప్రమాదానికి కారణమైన బొలెరో.. కొద్ది దూరంలో మరో కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జుగా మారింది.  ఈ ప్రమాదంలో  ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబాల్లో ఈ ప్రమాదం ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. మృతల కుటుంబ సభ్యుల రోదనలను ఆపడం ఎవరి తరం కాలేదు.  ఈ ఘటన తరువాత స్థానికులు, మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయాని వారు చెబుతున్నారు.  రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేయమని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసిన అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి.. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.