iDreamPost
android-app
ios-app

NTR వర్థంతి సందర్భంగా.. నారా లోకేశ్ కి RGV సూటి ప్రశ్న!

  • Published Jan 18, 2024 | 10:36 PM Updated Updated Jan 18, 2024 | 10:36 PM

RGV Questions To Nara Lokesh: వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ తరచూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నారా లోకేశ్ కి సూటి ప్రశ్న వేసి..మరోసారి వార్తల్లో నిలిచారు.

RGV Questions To Nara Lokesh: వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ తరచూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నారా లోకేశ్ కి సూటి ప్రశ్న వేసి..మరోసారి వార్తల్లో నిలిచారు.

  • Published Jan 18, 2024 | 10:36 PMUpdated Jan 18, 2024 | 10:36 PM
NTR వర్థంతి సందర్భంగా.. నారా లోకేశ్ కి RGV సూటి ప్రశ్న!

నేడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 28వ వర్థంతి. ఈ సందర్భంగా నందరమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళర్పించారు. అంతేకాక నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ సమాధి వద్దకు చేరుకుని పూలమాలలు వేస్తూ నివాళర్పించారు. అంతేకాక నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ లు కూడా నివాళ్లు అర్పిస్తూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. అయితే నారా లోకేశ్ పెట్టిన పోస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించి.. లోకేశ్ సూటి ప్రశ్న వేశారు.

వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ తరచూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాక ఇటీవల వ్యూహం సినిమా విషయంలో మరోసారి న్యూస్ లో నిలిచారు. తనదైన శైలీలో స్పందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఒకవైపు సినిమా గురించి మాట్లాడుతూనే మరోవైపు రాజకీయ అంశాలపై కూడా ఆర్జీవీ తనదైన శైలీలో కామెంట్స్ చేస్తుంటారు. ఎక్స్ వేదికగా సంచలన కామెంట్స్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా లోకేశ్ కి సూటి ప్రశ్న వేశారు.

గురువారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని తెలుగు దేశం పార్టీ గుడివాడలో ‘రా కదలిరా సభ’ నిర్వహించింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సహా నందమూరి అభిమానులందరూ ఆయనకు నివాళి అర్పించారు. ఇక మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా ఎన్టీఆర్ కి నివాళులు అర్పించారు. అంతేకాక ఎక్స్ (ట్విట్టర్)లోనూ నారా లోకేశ్.. రామారావుకు నివాళి అర్పిస్తూ పోస్టు పెట్టారు. ఆ పోస్టుపై రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు.  తెలుగు జాతి ఖ్యాతి మహానాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.

కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్ముడికి జోహార్లని నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అంతేకాక ఎన్టీఆర్ అమరుడు అని హ్యాష్ ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ పై షార్ప్‌గా ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు. మరి.. ఆ ఎన్టీఆర్ హంతకుడిని మీరు ఏం చేస్తారు సార్?’ అంటూ లోకేశ్ ను ఆర్జీవీ ప్రశ్నించారు. ఇక వీరిద్దరి ట్వీట్‌లకూ సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన  వస్తున్నది. టీడీపీ, వైసీపీ అభిమానులు రీట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో వార్ చేస్తున్నారు.  అంతేకాక కామెంట్లు పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. కొందరు ఆర్జీవీని మద్దుతు చేస్తుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ఈ ట్వీట్ రాజకీయమైనది కావడంతో సోషల్ మీడియాలో పెను దుమారం రేగుతున్నది. మరి.. ఆర్జీవీ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetturka girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş