మందుబాబులకు షాక్.. మద్యం అమ్మకాలపై ఆంక్షలు! ఎందుకంటే?

Restrictions on Sale of Liquor: ప్రస్తుతం ఏపీలో ఎన్నికల జోరు కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నువ్వా.. నేనా అన్న చందంగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు.

Restrictions on Sale of Liquor: ప్రస్తుతం ఏపీలో ఎన్నికల జోరు కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నువ్వా.. నేనా అన్న చందంగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నడుస్తుంది. అధికార, ప్రతిపక్ష నేతలు హోరా హూరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇక అధికార పార్టీ వైఎస్సాఆర్‌సీపీ ఒంటరిగానే పోరుకి సిద్దమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసిన అభివృద్ది పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్ర మొదలు పెట్టారు సీఎం జగన్. ఈ యాత్రకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.  మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమీషన్. వివరాల్లోకి వెళితే..

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచారాలు పీక్ స్టేజ్ కి వచ్చాయి. ఎన్నికల సందర్బంగా కొంతమంది నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో ఉన్నారు.  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మద్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రబుత్వ రిటైల్ దుకాణాల్లో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించింది ఎలక్షన్ కమీషన్. ఈసీ నిబంధనలు ప్రకారం గత ఏడాది 2023 ఏప్రిల్ నాటికి ఏ షాపు ఎంత వరకు అమ్మకాలు జరిగాయో అంత మేరకే అమ్మకాలు జరపాల్సి ఉంటుందని అదేశించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్ నాటికి నమోదైన మద్యం ఎంత మేరకు జరిగింతో దాన్ని బట్టి రిటైల్ దుకాణాల్లో అమ్మకాలు జరపాల్సి ఉంటుందని మద్యం పరిమాణాన్ని నిర్ణయిస్తున్నారు అధికారులు.

ఆంధ్రప్రదేశ్ లో బేవరేజెస్ కార్పోరేషన్ డిపోల నుంచి వస్తున్న మద్యం సప్లయ్ పై ఎక్సైజ్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎన్నికల సమయం కావడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీ నేతలు మద్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.వేసవి కాలం కావడంతో బీర్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.. దీంతో మద్యం రిటైల్ షాపులు ఇష్టానుసారంగా విక్రయాలు జరుపుతుంటారు. దీనిపై కొరఢా ఝులిపించేందుకు ఈసీ సిద్దమైంది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించడంతో పాటు నిల్వల ఎత్తివేతపై ఆంక్షలు విధించారు. దీంతో రాత్రి ఉన్న మద్యం షాపు ఉదయం మూతపడి ఉండటంతో మందుబాబులు తలలు పట్టుకుంటున్నారు.

Show comments