P Krishna
విశాఖ ఫిషింగ్ హార్బర్ ఈ నెల 9న జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనలో దాదాపు 49 బోట్లు కాలిపోయాయని మత్స్యకారులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ ఈ నెల 9న జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనలో దాదాపు 49 బోట్లు కాలిపోయాయని మత్స్యకారులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
P Krishna
ఏపీలో విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనలో కొన్ని బోట్లు పూర్తిగా దగ్ధం కాగా.. మరికొన్ని బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. బోట్లు నష్టపోయిన మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. హార్బర్ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. తాజాగా విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం కేసులో కీల్ ఆధారలు లభ్యమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు పోలీసులు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు హార్బన్ నుంచి బయటకు వస్తున్నట్లు గుర్తించారు. ఈ ఇద్దరు ప్రమాదానికి కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటీ? ఎవరైనా కావాలనే ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా? ప్రమాద వశాత్తు జరిగిందా? అన్న కోణంలో విచారణ కొనసాగించారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కీలకమైన సీసీ టీవీ ఫుటేజ్ ని రిలీజ్ చేయడంతో ఘటన మరో మలుపు తిరిగింది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు హడావుడిగా హార్బర్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ నెల 19న రాత్రి 10.49 నిమిషాలకు ఇద్దరు వ్యక్తులు హడావుడిగా బయటకు రాగా.. 10:50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. ఈ నెల 19న విశాఖ ఫిషింగ్ హార్బర్ లో కొంతమంది వ్యక్తులు పార్టీ చేసుకున్నారని.. మందులోకి మంచింగ్ కోసం ఉప్పు చేపను ఫ్రై చేశారు. ఆ చేప తిన్న తర్వాత వారిలో ఒకరు సిగరెట్ తాగి.. చివరి ముక్క బోటు సమీపంలో విసిరి వేయగా దాని నుంచి వచ్చిన నిప్పురవ్వలతో బోటు కాలి ఇంత పెద్ద ప్రమాదానికి కారణం అయ్యిందని అంటున్నారు. మరో వాదన కూడా వినిపిస్తుంది.. ఉప్ప చేపను ఫ్రై చేసే సమయంలో మంటలు చెలరేగడం వల్ల ప్రమాదం జరిగిందని అంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఉప్పు చేపనా? సిగరెట్ ముక్కా? కారణం ఏదైనా కోట్లలో నష్టం వాటిల్లింది. ఎంతోమంది మత్స్యకారులు కన్నీటికి కారణం అయ్యింది. అయితే ఉప్ప చేపను ఫ్రై చేసింది స్థానిక మత్స్యకారుడు, నానికి వరుసకు మామ అని అతని పేరు సత్యం అని తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం యూట్యూబర్ నాని బోటులో సత్యం పనిచేశాడు. పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజ్ లో సత్యం బయటకు వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులు ఎవరు అన్న విషయం పోలీసులు అరెస్టు చేసిన తర్వాత తెలుస్తుంది.. ఈ విషయం గురించి పోలీసులు ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఘటనపై యూట్యూబర్ లోకల్ బాయ్ నాని పై మొదట ఎన్నో ఆరోపణలు వచ్చాయి. నానీ అతని స్నేహితులు మందు పార్టీ చేసుకుంటున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని.. తర్వాత ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై లోకల్ బాయ్ నాని స్పందించారు.. తాను ఏ తప్పు చేయలేదని, నాకు అన్నం పెట్టే గంగమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రమాదం జరిగిన రోజు తాను ఓ హూటల్లో ఉన్నానని, దానికి సంబంధించిన సీసి టీవీ ఫుటేజ్ పోలీసుల వద్ద ఉందని అన్నారు. ప్రమాదం జరిగిందని తెలియగానే వెంటనే అక్కడికి వెళ్లి వీడియో తీశానని.. మా బాధల గురించి చెప్పడానికే ఆ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్లు తెలిపాడు.