iDreamPost
android-app
ios-app

బిగ్ బ్రేకింగ్: ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. 14 మంది మృతి

Escientia Company: ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 14 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

Escientia Company: ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 14 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

బిగ్ బ్రేకింగ్: ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. 14 మంది మృతి

ఆకస్మాత్తుగా చోటుచేసుకునే ప్రమాదాలు తీరని విషాదాన్ని మిగుల్చుతున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడిపిన వారు ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాల్లో తీరని విషాదం మిగిలిపోతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్ అయ్యింది. మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. భారీగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఫార్మా కంపెనీలో ప్రమాద సమయంలో వందలాది మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు సంబవించగానే ప్రాణ భయంతో వణికిపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ సీఎం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.