iDreamPost
android-app
ios-app

చంద్రబాబుపై రాయపాటి రంగరావు అసహనానికి అసలు కారణం?

Rayapati Ranga Rao: తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీడీపీకి ఆ పార్టీ సీనియర్ నేత రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఇష్యూకి గల కారణాల పై ఓ టాక్ వినిపిస్తోంది.

Rayapati Ranga Rao: తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీడీపీకి ఆ పార్టీ సీనియర్ నేత రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఇష్యూకి గల కారణాల పై ఓ టాక్ వినిపిస్తోంది.

చంద్రబాబుపై రాయపాటి రంగరావు అసహనానికి అసలు కారణం?

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఎండాకాలంలో వచ్చే వేడికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది.. వివిధ పార్టీలకు వారి నాయకులు షాకులు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అయితే దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మూడు రోజుల క్రితం విజయవాడ ఎంపీ కేశినేని నాని, రెండు రోజుల క్రితం తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగంట్ల స్వామిదాస్ టీడీపీకి రాజీనామా చేసి.. అధినేతకు గట్టి షాక్ ఇచ్చారు. తాజాగా రాయపాటి రంగరావు కూడా ఆ పార్టీ కి రాజీనామా చేసి.. మరో షాకిచ్చారు. ఈయన అయితే ఏకంగా చంద్రబాబు ఫోటోను నేలపై విసిరి కొట్టారు. ఆయన కోపానికి గల కారణం అదే అంటూ కొన్ని వార్తలు వినిపిస్తోన్నాయి.

శుక్రవారం తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీడీపీకి ఆ పార్టీ సీనియర్ నేత రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. అంతేకాక ఈ సందర్భంగా టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఒక దిక్కుమాలిన పార్టీ అని దుయ్యబట్టారు. టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదంటూ రంగరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ అని ఆయన ఆరోపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తమ కుటుంబాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని రంగారావు మండిపడ్డారు. గత ఎన్నికల్లో 150 కోట్లు తమ నుంచి తీసుకున్నారని, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఎంత తీసుకున్నారో తన దగ్గర లెక్కలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. అంతేగాక, మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తా? శపథం చేశారు. లోకేష్‌ను మంగళగిరిలో ఓడిస్తానని  సవాల్ చేసి చెబుతున్నాను అంటూ స్పష్టం చేశారు.

ఆయన కుటుంబసభ్యులు.. ఆఫీసులో ఉన్న చంద్రబాబు ఫొటోను నేలకేసి పగలగొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై అనేక వార్తలు వినిపిస్తోన్నాయి. రాయపాటి రంగరావు తండ్రి రాయపాటి సాంబశివరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కుటుంబానికి పల్నాడు జిల్లాలో మంచి పట్టు ఉంది. రాయపాటి కుటుంబానికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్నో పదవులు సైతం వారు అలకరించారు. 2019 సైతం రాయపాటి సాంబశివరావు నర్సారావు పేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆ సమయంలో టీడీపీ కోసం వారి కుటుంబం భారీగా ఖర్చు చేసింది. అయితే మరోసారి కూడా తమకే టికెట్ వస్తుందనే ఆశలో రాయపాటి రంగరావు కుటుంబం ఉంది. కానీ చంద్రబాబు..తనకు అలవాటునే కొనసాగించారు. చివరి వరకు అందరికి ఆశలు చూపి..ఆఖర్లో హ్యాండ్ ఇవ్వడం చంద్రబాబు అలవాటని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతుంటారు. ఆయనకు నమ్మకంతో పనిలేదని, నమ్మించి.. చివర్లో మోసం చేయడమే చంద్రబాబుకు తెలుసని చాలా మంది చెప్పే మాట. అదే ధోరణిని నర్సరావుపేట విషయంలోనూ చంద్రబాబు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

తొలి నుంచి ఆ స్థానం రాయపాటి కుటుంబానికి ఇస్తాని నమ్మించినట్లు, ఈ క్రమంలోనే వారిచేత భారీగా ఖర్చు పెట్టించినట్లు సమాచారం. సీఎం జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని రాయపాటికి కుటుంబానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.  దీంతో ఇంతకాలం పార్టీనే నమ్ముకుని, పార్టీ కోసం ఆస్తులనే పొగొట్టుకున్న తమకు అన్యాయం చేయడం రంగారావు కుటుంబం తీవ్ర స్థాయిలో ఆగ్రహం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాయపాటి కుటుంబం టీడీపీని వీడుతున్నట్లు సమాచారం. మరి..రాయపాటి రంగరావు ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.