రేషన్‌ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం..

Ration card Holders: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత కార్డు మంజూరు చేస్తుంటారు. తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Ration card Holders: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత కార్డు మంజూరు చేస్తుంటారు. తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాయి. అలానే ప్రజలకు ఆహార భద్రత కోసం పలు స్కీమ్స్ అందిచడంతో పాటు స్కీమ్స్ ను జారీ చేసింది. తాజాగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత కార్డు మంజూరు చేస్తుంటారు. ఆ రేషన్ కార్డులు కూడా ఆర్థిక స్థితిని బట్టి విభజించారు. తెల్లకార్డు, పింక్ కార్డు అనే వేరు వేరు రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులు ఉన్నవారికి రేషన్ బియ్యాన్ని అందిస్తుంటారు. తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల్లో రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుంది. ముఖ్యంగా సీఎం జగన్ ప్రభుత్వంలో రేషన్ సరకులను ఇంటి వద్దకే వచ్చి..అందిస్తున్నారు. అలానే పెన్షన్ కూడా రెండు నెలల క్రితం వరకు వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి అందించేవారు. కానీ కొందరు ఫిర్యాదు చేయడం ఈసీ వాలంటీర్ల సేవలను నిలిపివేసింది. దీంతో పెన్షన్ దారులు ఇబ్బంది పడుతున్నారు. అలానే రేషన్ సరుకుల పంపిణీ చేసే విషయంలో ఎలా ఉంటుందో అని రేషన్ కార్డు దారులు టెన్షన్ లో ఉన్నారు. ఎండకాలం రేషన్ షాపు వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందేమో భయపడ్డారు.

ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి రేషన్ పంపిణీ షురూ చేయనున్నట్లు తెలిపారు అధికారులు. ఎప్పటిలాగే మొబైల్‌ డిస్పర్సింగ్‌ యూనిట్‌ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ  ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఆపరేటర్లు ఈ ప్రక్రియ షురూ చేస్తారని అధికారులు తెలిపారు. విటమిన్‌ బీ12, ఐరన్‌ కలిపిన పోషక విలువలతో కూడిన బియ్యం, పంచదార, గోధుమపిండి నిర్దేశిత ధరలతో ఇంటి వద్దనే అందించనున్నట్లు అధికారులు తెలిపారు

ఈ అవకాశాన్ని రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కాగా.. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో రేషన్ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో వారి స్థానంలో వీఆర్‌వోలు రేషన్ పంపిణీలో పాల్గొననున్నారు.  రేషన్ సరుకల పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1967కు ఫోన్‌ చేయవచ్చని అధికారులు తెలిపారు. మరి..  రేషన్ విషయంలో  ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments