Arjun Suravaram
ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన వైఎస్సార్ సీపీ సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..సింహనాందంతో ప్రసంగం చేశారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఇదే సమయంలో చంద్రబాబుకు ఓ సవాల్ కూడా విసిరారు.
ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన వైఎస్సార్ సీపీ సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..సింహనాందంతో ప్రసంగం చేశారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఇదే సమయంలో చంద్రబాబుకు ఓ సవాల్ కూడా విసిరారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..సిద్ధం పేరుతో ఎన్నికల సమరంలోకి దిగిన సంగతి తెలిసిందే. గతనెల 27న భీమిలీ నుంచి సిద్ధం పేరుతో ఎన్నికల సమర శంఖారావన్ని పూరించారు. అనంతరం ఏలూరు జిల్లాలో కూడా సిద్ధం సభను నిర్వహించారు. ఈ రెండు సభలు జనసంద్రాన్ని తలపించాయి. తాజాగా రాప్తాడులో జరిగిన సభను చూస్తే.. సముద్రంతోపోటీ పడుతూ..సిద్ధం సభకు జనం పోటెత్తారు. సభ ప్రాంగణంలో స్థలం లేక జాతీయ రహదారిపై లక్షలాది మంది జనాలు నిల్చున్నారు. ఇక రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసగించారు. తన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ.. చంద్రబాబుకు ఓ సవాల్ విసిరారు సీఎం.
ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ సిద్ధం సభ జరిగింది. ఈ సభ రాయలసీమ చరిత్రలోని కనీవిని ఎరుగని స్థాయిలో రాప్తాడు సిద్ధం సభ జరిగింది. లక్షలాది మంది వైఎస్సార్ సీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు సభకు తరలివచ్చారు. ఇక సభకు హాజరైన సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన ర్యాంప్ పై నడుచుకుంటూ వెళ్తూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ‘సిద్ధం’ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ..ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తోందని జిల్లాల పునర్విభజన తరువాత రాయలసీమకు సముద్ర తరలి వస్తే… నేడు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చిందని తెలిపారు. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు.. ఇక్కడున్న ప్రతి సీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఈ ఐదేళ్ల కాలంలో ప్రతి ఇంటికీ మనందరి ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమం పథకాలు కొనసాగాలని ముందుకెళ్తున్న మనకు, వీటన్నింటినీ రద్దు చేయడమే లక్ష్యంగా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా? అంటూ పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ యుద్ధంలో మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకూ మధ్య జరుగుతుందని, విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధమిదని, పేదవాడి భవిష్యత్తు కోసం.. వారి తరఫున నిలబడేందుకు మీరందరూ సిద్ధమేనా? అంటూ సీఎం జగన్ సింహనాందంతో ప్రసంగించారు.
ఇంకా సీఎం జగన్ మాట్లాడూ..”ఇదే వేదిక నుంచి చంద్రబాబు నాయుడుకి ఒక సవాలు విసురుతున్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మూడేళ్లు సీఎం సీట్లో కూర్చున్నారు. మరి..మీ పేరు చెబితే రైతులకు, అక్కచెల్లెమ్మలకు గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని చంద్రబాబును అడుగుతున్నాను. అలానే చంద్రబాబు పేరు చెబితే విద్యార్థులకు గుర్తుకొచ్చే పథకం ఏదైనా ఒక్కటైనా ఉందా?. బాబు పేరు చెబితే ఏ ఒక్కరికీ ఆయన సీఎంగా ఉండగా మంచి పథకం తీసుకొచ్చాడని గుర్తుకు రాదు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ కనీసం ఒక్కటైనా కనిపిస్తోందా?” అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు సీఎం జగన్
“ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మ్యానిఫెస్టోలను రంగురంగుల్లో రాయడం, ఆ తరువాత మోసం చేయడమే ఆనవాయితీగా చంద్రబాబు పెట్టుకున్నాడు. గతం ప్రజలకు గుర్తుండదన్న దీమాతో మళ్లీ చంద్రబాబు బంగారు కడియమిస్తానని ఊబిలోకి దింపి మనుషులను తినేసే పులి మాదిరిగా నేడు ఎర చూపుతున్నాడు. రంగు రంగుల మానిఫెస్టోతో మళ్లీ మోసం చేసేందుకు బయలుదేరాడు’’అంటూ సీఎం జగన్.. చంద్రబాబుపై మండిపడ్డారు. మరి..రాప్తాడులో సీఎం జగన్ చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.