iDreamPost
android-app
ios-app

APకి రెయిన్ అలర్ట్.. మరో మూడురోజుల పాటు వర్షాలు

  • Published Aug 26, 2024 | 10:10 PM Updated Updated Aug 26, 2024 | 10:10 PM

Rains in AP: ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Rains in AP: ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

APకి రెయిన్ అలర్ట్.. మరో మూడురోజుల పాటు వర్షాలు

గత కొద్ది రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పట్లో వానలు తగ్గేలా లేవు. భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక ఇప్పటికే తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఏపీలో రేపు అనగా మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

ఆగస్ట్ 29వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడురోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.