తెలుగు రాష్రాలకు ఐఎండీ తీవ్ర హెచ్చరిక.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

Weather Latest Update: ఈ ఏడాది దేశంలో నైరుతి రుతు పవణాలు చురుగ్గా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ద్రోణి విస్తరించి ఉండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Weather Latest Update: ఈ ఏడాది దేశంలో నైరుతి రుతు పవణాలు చురుగ్గా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ద్రోణి విస్తరించి ఉండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఈ ఏడాది మార్చి నుంచి ఎండలు దంచికొట్టాయి.. దీంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అలాంటి సమయంలో జూన్ నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల, కేరళ తీరంలో ఉపరితల ద్రోణి బలపడింది. దీని కారణంగా అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడటం వల్ల నేటి నుంచి ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు (ఆగస్టు 7) నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావం రెండు రాష్ట్రాలపై పడనున్నట్లు ఐఎండీ తెలిపింది.   తెలంగాణలో కొమురం భీం, ఆదిలాంబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. పలు చోట్ట చిరు జల్లులు పడుతున్నాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో పొడి వాతావరణం కనిపిస్తుంది. ఉదయం వేళ ఆకాశం మబ్బులు కమ్ముకొని ఉంటాయని.. సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వానతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అన్నారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి అల్లూరి సీతారామరాజు, బాపట్ల,కృష్ణ, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Show comments