iDreamPost
android-app
ios-app

వచ్చే నెలలో జర్నీ ప్లాన్ చేసుకున్నారా? రద్దయిన రైళ్లు, దారి మల్లించబడ్డ ట్రైన్స్ ఇవే!

  • Published Aug 23, 2024 | 2:35 PM Updated Updated Aug 23, 2024 | 2:35 PM

ఈ మధ్య కాలంలో ఈ రైల్వే శాఖకు సంబంధించి ఏదో ఒక వార్తలు బిగ్ అలర్ట్ లు వినిపిస్తునే ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో రైలు ప్రమాదాల దగ్గర నుంచి రైళ్లు రద్దు వంటి వార్తలనే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ రైలు ప్రయాణికులకు  రైల్వేశాఖ ఓ ముఖ్య గమనిక జారీ చేసింది.

ఈ మధ్య కాలంలో ఈ రైల్వే శాఖకు సంబంధించి ఏదో ఒక వార్తలు బిగ్ అలర్ట్ లు వినిపిస్తునే ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో రైలు ప్రమాదాల దగ్గర నుంచి రైళ్లు రద్దు వంటి వార్తలనే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ రైలు ప్రయాణికులకు  రైల్వేశాఖ ఓ ముఖ్య గమనిక జారీ చేసింది.

  • Published Aug 23, 2024 | 2:35 PMUpdated Aug 23, 2024 | 2:35 PM
వచ్చే నెలలో జర్నీ ప్లాన్ చేసుకున్నారా? రద్దయిన రైళ్లు, దారి మల్లించబడ్డ ట్రైన్స్ ఇవే!

చాలామంది ప్రయాణికులు తొందరగా తమ గమ్య స్థానల్లో చేరుకోవాలంటే.. అందుకు బెస్ట్ ఆప్షన్ ట్రైన్ జర్నీ అనే చెప్పవచ్చు. అందుకే నిత్యం సామాన్య ప్రయాణికుల దగ్గర నుంచి చిరు వ్యాపరస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు వరకు అందరూ ఈ రైలు ప్రయాణాలను కొనసాగిస్తుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో ఈ రైల్వే శాఖకు సంబంధించి ఏదో ఒక వార్తలు బిగ్ అలర్ట్ లు వినిపిస్తునే ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో రైలు ప్రమాదాల దగ్గర నుంచి రైళ్లు రద్దు వంటి వార్తలనే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ రైలు ప్రయాణికులకు  రైల్వేశాఖ ఓ ముఖ్య గమనిక జారీ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ముఖ్య అలర్ట్ ను జారీ చేసింది. కాగ, ఆ ప్రకటనలో వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 29 వరకు విజయవాడ డివిజన్ లోని పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే కొన్ని రైళ్లను దారి మళ్లీస్తున్నట్లు కూడా వెల్లడించింది.అయితే ఈ రైళ్లు రద్దు కావడానికి కారణం పలు సాంకేతిక సమస్యలే అని రైల్వేశాఖ అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక రద్దు అయిన రైళ్లలో మచిలీపట్నం- విజవాడ (07896) (విజయవాడ, రామవరప్పాడు మధ్య) రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే విజయవాడ-మచిలీపట్నం (07896), నర్సాపూర్- విజయవాడ (07863), విజయవాడ- మచిలిపట్నం(07866), మచిలీపట్నం- విజయవాడ (07770), విజయవాడ- భీమవరం జంక్షన్(07283), మచిలీపట్నం- విజయవాడ(07870), విజయవాడ- నర్సాపూర్ (07861) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.

indian railway alert

అలాగే మరికొన్ని  రైళ్లను విజయవాడ, గుణదల, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. అయితే వాటిలో  సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో ఎర్నాకుళం – పాట్నా (22643), సెప్టెంబరు 7, 14, 21, 28 తేదీల్లో భావనగర్ – కాకినాడపోర్ట్‌ (12756), సెప్టెంబరు 4, 6, 11, 13, 18, 20, 25, 27 తేదీల్లో బెంగళూరు – గౌహతి (12509) దారి మళ్లించారు.  ఇక సెప్టెంబరు 2, 4, 6, 7, 9, 11, 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ – భువనేశ్వర్‌ (11019), సెప్టెంబరు 2వ తేదీ నుంచి 29వరకు ధన్‌బాద్ – అలెప్పి (13351).. సెప్టెంబరు 5, 12, 19, 26తేదీల్లో టాటా, యశ్వంత్‌పూర్‌ (18111).. సెప్టెంబరు 4, 11, 18, 25 తేదీల్లో జెసిది – తాంబరం (12376).. సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో హతియ – ఎర్నాకుళం (22837), సెప్టెంబరు 7, 14, 21, 28 తేదీల్లో హతియ – బెంగళూరు (18637), సెప్టెంబరు 3, 8, 10, 15, 17, 22, 24, 29 హతియ – బెంగళూరు (12835), సెప్టెంబరు 6, 13, 20, 27 తేదీల్లో టాటా – హతియ (12889) రైళ్లను దారి మళ్లించారు. కనుక ఈ తేదీల్లో రైలు ప్రయాణం చేయాలనుకునే  ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రయాణ తేదీలను వాయిదా వేసుకోవడం, ఇతర రావాణాను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. మరీ, ఆ తేదీల్లో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులు ఈ రైల్లు క్యాన్సిల్ అయ్యే విషయాలను గమనించండి.