అదృష్టం అంటే ఇతడిదే.. పోయింది అనుకున్న గోల్డ్ వెతుక్కుంటూ వచ్చింది!

సాధారణంగా ఎవరైన తమ వస్తువులను పోగొట్టుకుంటే.. తిరిగి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. చివరకు అవి తిరిగి వారికి చేరితే..లక్ అంటారు. తాజాగా కడపలో ఆసక్తికర ఘటన జరిగింది.

సాధారణంగా ఎవరైన తమ వస్తువులను పోగొట్టుకుంటే.. తిరిగి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. చివరకు అవి తిరిగి వారికి చేరితే..లక్ అంటారు. తాజాగా కడపలో ఆసక్తికర ఘటన జరిగింది.

సాధారణంగా అదృష్టం అనే పదానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. అలానే ఒక మనిషి జీవితంలో  కొన్ని ఘటనలను చూసినప్పుడు ఇది కదా లక్ అంటే అని అనకమానరు. ఏదైనా లాటరీ తగిలినప్పుడు, కోట్ల రూపాయలు ఉండే బ్యాగు దొరికినప్పుడు, అలానే లక్షల విలువ చేసే వస్తువులు పోయి..తిరిగి దొరికినప్పుడు..వీడు లక్కీరా బాబు అని అంటారు. అలానే ఏపీలోని కడప జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి వచ్చిన ఫోన్ కాల్ తో తన చేతిలోకి లక్షల రూపాయలు వచ్చాయి. అయితే పూర్తి వివరాలు తెలియాలంటే..ఈ స్టోరీ చదవాల్సిందే…

సాధారణంగా ఎవరైన తమ వస్తువులను పోగొట్టుకుంటే.. తిరిగి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. చివరకు అవి తిరిగి వారికి చేరితే..లక్ అంటారు. లేకుంటే…వాటితో మనకు రుణం తీరిపోయిందని వేదాంతాలు మాట్లాడుతుంటారు. తాజాగా కడపలో ఆసక్తికర ఘటన జరిగింది. కర్ణాటకలోని హోస్‌పేట లో నీరజ్‌కుమార్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. మే18న నీరజ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి హరిప్రియ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేందుకు రేణిగుంట స్టేషన్‌కు చేరుకున్నారు. ఇక ట్రైన్ రానే వచ్చింది. ఈ క్రమంలోనే నీరజ్  కుటుంబం ముందుగా వారి మూడు లగేజీ బ్యాగులను ఏ-1 బోగీలో పెట్టారు. ప్లాట్‌ఫాం పై ఉన్న మిగతా తన  కుటుంబ సభ్యులను ఎక్కించేందుకు నీరజ్‌ కుమార్‌ రైలు నుంచి కింద దిగారు.

ఈలోపు ఆ రైలు ప్లాట్ ఫామ్ నుంచి బయలు దేరింది. అతడు తేరుకునే లోపే రైలు స్టేషన్ వదలి వెళ్లిపోయింది. ఇక వెంటనే అప్రమత్తమైన నీరజ్ కుమార్ రైల్వేకు సంబంధించిన 139కు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పాడు. అంతేకాక తనకు, తన లగేజీకి సంబంధించిన వివరాలను రైల్వే అధికారులు తెలియజేశాడు. ఇక వెంటనే అలెర్ట్ అయిన రైల్వే కంట్రోల్ రూం అధికారులు కడప ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కడప ఆర్పీఎఫ్ అధికారులు ఈ రైలు కడప స్టేషన్ కి రాగానే హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలులోని ఎ-1 బోగీలో ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం వాటిని కడప రైల్వే పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఆ తరువాత ఈ సమాచారాన్ని బాధితుడు నీరజ్‌కుమార్‌కు ఫోన్ లో తెలియజేశారు. ఈ క్రమంలోనే అతడు సోమవారం కడప రైల్వే స్టేషన్ కి వచ్చి తనకు సంబంధించి ఆధారాలు చూపించాడు. దీంతో రైల్వే పోలీసులు ఆ లగేజీని నీరజ్ తిరిగి అప్పగించారు. మొత్తం మూడు బ్యాగుల్లో  లక్ష 20 వేలు నగదు ఉన్నాయి. అలానే బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు ఉన్నాయి. తాను రైల్ మదద్ ద్వారా సమాచారం ఇవ్వగానే స్పందించిన కడప ఆర్‌పీఎఫ్‌ అధికారులకు నీరజ్‌కుమార్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక నీరజ్ సంబంధించిన ఈ స్టోరీ తెలిసిన వారు.. లక్ అంటే నీదే భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments