iDreamPost
android-app
ios-app

ఫలించిన సీఎం జగన్ ఒత్తిడి.. దిగివచ్చిన కేంద్రం

ఫలించిన సీఎం జగన్ ఒత్తిడి.. దిగివచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు సుపరిపాల  అందిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి వివిధ రూపాల్లో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అలానే సీఎం జగన్.. తన  తండ్రి మాదిరిగా.. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.  ఇప్పటికే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. రైతులకు సీఎం జగన్ తరచూ ఏదో ఒక శుభవార్త చెప్తూనే ఉంటారు. తాజాగా పొగాకు రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రికార్డు స్థాయిలో ధర పలుకుతున్న తరుణంలో సీఎం జగన్.. కేంద్రం పై చేసిన ఒత్తిడి ఫలించింది. ఫలితంగా ఎటువంటి పెనాల్టీ లేకుండా అదనపు ఉత్పత్తి కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

2022-23 ఏడాదికి గాను 81 వేల హెకార్టలో సాగుకు, 142 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. 2022 డిసెంబర్ లో మాండూస్ తుఫాన్ విరుచకపడిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా సగానికిపైగా పొగాకు పంటతో పాటు శనగ, ఇతర పంటలు రైతులు భారీగా నష్టపోయారు. మరోవైపు గతేడాదే పొగాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తి ఎక్కువ వచ్చిన సందర్భంలో ప్రత్యేకంగా 5 శాతం పెనాల్టితో కొనుగోలుకు కేంద్రం అనుమతిస్తుంది.  అదనపు ఉత్పత్తికి పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే తీవ్రంగా నష్టపోతామంటూ పొగాకు రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి విన్నపం మేరకు సీఎం జగన్ కేంద్ర వాణిజ్య పన్నుల శాఖమంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాశారు.

కర్ణాటకలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట స్థానంలో రెండో సారి విత్తుకున్న సందర్భంలో  పెనాల్టీ లేకుండా ఉత్పతి విక్రయాలనకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అదే రీతిలో ఏపీ రైతులకు కూడా అనుమతివ్వాలని  సీఎం కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చారు.  అదేవిధంగా రాష్ట్ర అధికారులు  ఢిల్లీ వెళ్లి పలుమార్లు సంప్రదింపులు జరిపారు. దీంతో  దిగి వచ్చిన కేంద్రం.. పెనాల్టీ లేకుండానే అదనపు అధీకృత ఉత్పత్తుల విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో పొగాకు రైతులు సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. మరి.. పొగాకు రైతులకు సీఎం జగన్ చేసిన కృషిపై మీ  అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.