ప్రస్తుతం ఏపీలో రాజకీయం వాడీవేడిగా నడుస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వారాహీయాత్రకు మందుకు వరకు వైసీపీ, టీడీపీ పార్టీల మధ్యల మాటల యుద్ధం జరిగేది. అయితే ప్రస్తుతం మాత్రం అధికార వైసీపీ, జనసేన పార్టీ మధ్య ఓ స్థాయిలో రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచకు పడతున్నారు. తాజాగా ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు.
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ జరుగుతున్న వాలంటీ వ్యవస్థ ఇష్యూపై స్పందించారు. చంద్రబాబు ఏది చెబితే పవన్ అది మాట్లాడతారని, సీఎం జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని పోసాని మండి పడ్డారు. సీఎం జగన్ ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం ఎవరూ ఏమీ చేయలేరని, ఆయనే పరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అలానే పవన్ కల్యాణ్ కు విలువలు ఉంటే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని పోసాని అన్నారు. డేటా చోరీ చేసింది చంద్రబాబు, లోకేష్‌లేనని, వాలంటీర్లను తిడితే వారి కుటుంబ సభ్యులు బాధ పడరా? అని ఆయన తెలిపారు.
చంద్రబాబు ఏం చెబితే దానిపై పవన్ స్పందిస్తాడాని, ఆయన చెప్పిన మార్గంలోనే పవన్ నడుస్తాడని పోసాని తెలిపారు. సినీ ఇండ్రస్టీలోని ఆడవాళ్లను తిట్టిన వాళ్లపై పవన్ ఎందుకు స్పందించడని ప్రశ్నించాడు. భీమవరంలో టీడీపీ వల్లే పవన్ ఓడిపోయారని పోసాని అన్నారు. అలానే ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు సీఎంగా జగన్ ఉంటారని పోసాని పేర్కొన్నారు. మరి.. పవన్ కల్యాణ్ పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వారికి జగన్ సర్కార్ శుభవార్త.. నెలకు ఒక్కొక్కరికి రూ.10వేలు!