ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఇటు ఆంధ్రప్రదేశ్.. అటు తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నాయకుల చేరికలు, పార్టీల మార్పులతో అన్ని ప్రధాన పార్టీలు తలమునకలు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామంతో.. రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు యూ టర్న్ తీసుకోబోతున్నాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటంటే? ఏపీ సీఎం జగన్ తో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకుదారి తీస్తోంది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం పొంగులేటి ఏపీ సీఎం జగన్ ను కలిశారు. కాగా.. ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పొంగులేటి. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ భేటీలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చజరిగినట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీకి చెందిన కాంగ్రెస్ కీలక నేత కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. అయితే గతంలో వైఎస్సార్సీపీ నుంచే పొంగులేటి ఖమ్మం ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి జగన్ కు పొంగులేటికి మంచి అనుబంధం కొనసాగుతూ వస్తోంది. ఆ అనుబంధం కారణంగానే ఇద్దరు కలుసుకున్నారని కొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్, పొంగులేటిల భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి వీరిద్దరి భేటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.