Krishna Kowshik
24 గంటలు 365 రోజులు తమ విధుల్లో తల మునకలైపోతుంటారు పోలీసులు. అయితే ఇప్పుడు ఈ ఖాకీలు తీరిక చేసుకుని మరీ.. పిల్లలతో మమైకమయ్యారు. వారితో కలిసి ఆడి పాడారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఇంతకు ఎక్కడంటే..? ఏపీలోనే
24 గంటలు 365 రోజులు తమ విధుల్లో తల మునకలైపోతుంటారు పోలీసులు. అయితే ఇప్పుడు ఈ ఖాకీలు తీరిక చేసుకుని మరీ.. పిల్లలతో మమైకమయ్యారు. వారితో కలిసి ఆడి పాడారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఇంతకు ఎక్కడంటే..? ఏపీలోనే
Krishna Kowshik
దేశ రక్షణ కోసం పాటుపడటంలో, పౌరులకు భద్రత కల్పించడంలో, సహాయ సహాకారాలు అందిండంలో ముందు వరుసలో ఉంటారు ఖాకీలు. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే.. తమకు న్యాయం చేయాలని ముందుగా ఆశ్రయించేది పోలీసులనే. అయితే సినిమాల ప్రభావమో లేక వ్యవస్థలో ఉన్న కొంత మంది వల్లో తెలియదు కానీ పోలీసులు అనగానే జనాల్లో ఓ రకమైన భయం ఉంటుంది. అక్కడెక్కడో పోలీసులు కనిపించినా.. పక్కకు జరిగిపోతుంటారు. ఇక చిన్న పిల్లలు సైతం వారిని చూసేందుకు కూడా భయపడుతుంటారు. కానీ తాము అందరి లాంటి వ్యక్తులేమేనని చాటి చెబుుతున్నారు ఇలాంటి పనులతో.
అల్లూరి జిల్లా పోలీసులు గిరిజన విద్యార్థులకు చేయూతను అందించింది తాము కఠినాత్ములం కాదని, తాము ఫ్రెండ్లీ పోలీసులమని నిరూపించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అడవి బిడ్డలకు సాయం అందించారు. జి మాడుగుల మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి పండుగను చేసుకున్నారు ఏపీ పోలీసులు. వారితో ఆడి పాడారు. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేశారు. పోలీసులతో పాటు జతకట్టారు సీఆర్ఫీ జవాన్లు. జి మాడుగుల ఏకలవ్య స్కూల్, బంధవీధి పాఠశాలతో పాటు, మినీ గురుకులం, కోరాపల్లి స్కూల్, కేజీబీవీ ప్రభుత్వ స్కూల్ పిల్లలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పిల్లలతో కలిసి పోలీసులు భోజనాలు చేశారు.
అంతే కాకుండా విద్యార్థులకు వస్త్రాలను పంపిణీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు రైటింగ్ మెటీరియల్ అందించారు. ఏఎస్పీ ధీరజ్ స్వయంగా పిల్లలకు భోజనం వడ్డించారు. వారికి ఆట పాటలు నిర్వహించి బహుమతులు అందజేశారు.అలాగే ప్రత్యేక రవాణా సౌకర్యం కూడా కల్పించారు. సంక్రాంతి సెలవులకు విద్యార్థుల గ్రామాలకు తీసుకెళ్లి.. వారిని ఇంటి వద్ద విడిచి పెట్టారు. ఎటువంటి కష్టం వచ్చినా.. భయపడకుండా తమకు చెప్పాలని పేర్కొన్నారు. తామున్నామన్నా భరోసాను కల్పించారు. పోలీసులు అంటే భయంగా ఊహించుకున్న పిల్లలు.. ఇప్పుడు తమతో కలిసి చిన్న పిల్లల్లా చిందులేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీసులు సంక్రాంతి సంబంరాలు పిల్లలతో జరుపుకున్నారు. పోలీసులు తీసుకున్న ఈ చర్యల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.