మాజీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చి మరీ.. ఆదాయ పన్నులశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు వద్ద ఉన్న రూ.118 కోట్లను నల్లదనంగానే ఐటీశాఖ గుర్తించింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల రూపంలో రూ.118 కోట్ల ముడుపులు అందుకున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేయడంతో ఆయనపై వైసీపీ మంత్రులు, ఇతర ముఖ్యనేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబుపై ఓ రేంజ్ లో విరుచుక పడుతున్నారు. అవినీతి చక్రవర్తి అయినా బాబు నీతులు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి సైతం బాబుపై తీవ్ర ఆరోణలు చేశారు. లోకేశ్ పాదయాత్ర కంటే ముందు ఆయన తండ్రికి వచ్చిన నోటిసులపై స్పందించాలని పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
మాజీ మంత్రి పేర్ని నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు. పేర్ని నాని మాట్లాడుతూ… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డదారిలో బోగస్ కాండ్రాక్ట్ ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి..తన ఖాతాలో జమ చేసుకున్నారని, ఇప్పుడు ఆ అవనీతి బాగోతం బట్టబయలైందని పేర్ని నాని అన్నారు. హిందూస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టలు చేసిందని, ఆ కథనంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. 2016 నుంచి బాబు చేసిన భాగోతం ఇప్పుడు బయకొచ్చిందని, ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ లతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారని అన్నారు. అలానే రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని, ఈ ముడుపుల బాగోతంపై ఐటీ నోటీసులు ఇచ్చింది పేర్కొన్నారు.
ఇంకా మంత్రి మాట్లాడుతూ..” సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తప్పుడు ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. చంద్రాబు నోటీసులపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదు?. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలి. ఎమ్మెల్సీ పోతుల సునీతపై నారా లోకేశ్ ఇష్టానుసారంగా మాట్లాడారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. లోకేశ్ ముందు పాదయాత్ర ఆపి..తన తండ్రి అవినీతిపై మాట్లాడాలి. లోకేశ్.. ముందు నీ తండ్రి అక్రమాలపై స్పందించు. ఎప్పటిలాగానే ఐటీ నోటీసులపై కూడా చంద్రబాబు స్టే తెచ్చుకుంటాడు” అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. మరి.. చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.