Arjun Suravaram
వైసీపీ కీలక నేతల్లో మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఒకరు. పవన్, చంద్రబాబు లు జగన్ పై ఓ చిన్న కామెంట్స్ చేసిన మొదట స్పందించే వ్యక్తి నానినే. అలాంటి వ్యక్తి.. ఏలూరు జిల్లా కలెక్టర్ పై మండిపడ్డారు.
వైసీపీ కీలక నేతల్లో మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఒకరు. పవన్, చంద్రబాబు లు జగన్ పై ఓ చిన్న కామెంట్స్ చేసిన మొదట స్పందించే వ్యక్తి నానినే. అలాంటి వ్యక్తి.. ఏలూరు జిల్లా కలెక్టర్ పై మండిపడ్డారు.
Arjun Suravaram
వైసీపీ కీలక నేతల్లో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలపై తనదైన శైలీలో కౌంటర్లు ఇస్తుంటారు. అంతేకాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసే వ్యాఖ్యలకు నాని ధీటుగా కౌంటర్ ఇస్తుంటారు. పేర్నినాని వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అయితే ఏలూరు జిల్లా కలెక్టర్ తో ఈయనకు కొంత కోల్డ్ వార్ ఉంది. గతంలో ఏలూరు కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సర్వసభ సమావేశాలకు రాకపోవడంతోనే కలెక్టర్ పై నాని మండిపడ్డారు. ఆ తరువాత సీఎస్ ను కలిసిన నాని..పలు విషయాలను తెలియజేశారు. తాజాగా ఏలూరు జిల్లా కలెక్టర్‌పై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి ఫైరయ్యారు. మంగళవారం నిర్వహించిన జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ హాజరు కాకపోవడంతో పేర్ని నాని సీరియస్ అయ్యారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ పై మాజీ మంత్రి, మంచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలంటే లెక్కలేని తనంతో కలెక్టర్ వ్యవహరిస్తున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు. మంగళవారం జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ భేటీకి ఉమ్మడి కృష్టా జిల్లా కలెక్టర్లు హాజరు అయ్యారు. అయితే ఏలూరు జిల్లా కలెక్టర్ వెంకటేశ్ మాత్రం సమావేశాలకు రాలేదు. దీంతో ఏలూరు కలెక్టర్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఏలూరు జిల్లా కలెక్టర్ పై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేయడం ఇది తొలిసారిగా కాదు గతంలో కూడా పలుమార్లు ఆయన తీరుపై నాని మండిపడ్డారు. గత జులైలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా జిల్లా సమావేశాలకు కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ హాజరు కాలేదు. దీంతో అప్పుడు పేర్ని నాని.. సీఎస్ జవహర్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. అయినా సరే మంగళవారం నిర్వహించిన జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ హాజరు కాలేదు. దీంతో ఆయనపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కావాలనే ఈ రోజు ఇరిగేషన్ మీటింగ్ పెట్టారని మండిపడ్డారు. అంతేకాక ఆ మీటింగ్ పేరుతో కింది స్థాయి అధికారులను కూడా ఈ జడ్పీ సమావేశానికి హాజరు కాన్విలేదన్నారు. ఇరిగేషన్ మీటింగ్ కావాలంటే.. జడ్పీ సమావేశానికి ఒక రోజు ముందు లేదా తరువాత పెట్టుకుని ఉంటే సరిపోతుంది కదా అంటూ పేర్ని నాని పేర్కొన్నారు. మరి.. ఏలూరు జిల్లా కలెక్టర్ పై నాని ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.