iDreamPost
android-app
ios-app

షర్మిల అలా చేయడం దురదృష్టకరం: మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy: ఏపీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాప్తాడులో పర్యటించారు. ఈనెల 18న జరగనున్న సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలీంచారు. ఈ సందర్భంగా ఆయన షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Peddireddy Ramachandra Reddy: ఏపీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాప్తాడులో పర్యటించారు. ఈనెల 18న జరగనున్న సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలీంచారు. ఈ సందర్భంగా ఆయన షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

షర్మిల అలా చేయడం దురదృష్టకరం: మంత్రి పెద్దిరెడ్డి

ప్రస్తుతం దేశమంత ఎన్నికల మూడ్ లోకి వెళ్లింది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్  ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు.. ఎక్కువ ఎంపీ స్థానాల్లో విజయం సాధించే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇది అంతా పక్కన పెడితే.. ఏపీ రాజకీయం మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. కేవలం అధికార వైసీపీని ఢీకొట్టేందుకే మిగిలిన అన్ని పార్టీలు పనిచేస్తున్నట్లు కనిపిస్తోన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అని పైకి చెప్పుకున్నా.. లోలోపల మాత్రం సీఎం జగన్ గెలుపును అడుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ జాబితాలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వచ్చి చేరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలతో తానేదో సాధించినట్లు భ్రమలో బతికేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమె చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి షర్మిల.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నోరు పారేసుకుంటూనే ఉంది. ఆయన చేసిన పరిపాలను జనాలు మెచ్చుకుంటుంటే.. ఆమె మాత్రం ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తూ..తానేదో గొప్ప కార్యం చేస్తున్నట్లు భావిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఆమె చేసే వ్యాఖ్యలు చూస్తే.. చంద్రబాబు రాసిన స్క్రీప్ట్ నే ఆమె చదువుతుందని క్లియర్ కట్ గా అర్థమవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే షర్మిల చేస్తోన్న వ్యాఖ్యలకు మంత్రి ఆర్కే రోజా ధీటుగానే సమాధానాలు చెప్పారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈనెల 18 రాప్తాడులో జరగనున్న సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.  సీఎం జగన్ కృషి వల్లే ఏపీ ఎక్కువ సాగునీటి జలాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఇక దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారంటూ టీడీపీ చేస్తున్నఆరోపణలపై కూడా మంత్రి ఘాటుగానే సమాధానం ఇచ్చారు. 2018కి ముందు ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్చిందని మంత్రి విమర్శించారు. దొంగ ఓట్లు టీడీపీ నమోదు చేయడం వల్ల తాము కొన్ని స్థానాల్లో ఓడిపోయామని ఆయన చెప్పుకొచ్చారు.

ఏపీ రైతులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు గురించి పక్కరాష్ట్రమైన తెలంగాణ అసెంబ్లీలో మంత్రులో చెబుతున్నారని తెలిపారు. ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ వింటే తెలుస్తుందని ప్రతిపక్షాలకు సూచించారు. వైఎస్‌ జగన్‌ అంటేనే నిజం అని.. ఖచ్చితంగా నిజం గెలుస్తుందన్నారు. టీడీపీ పతనావస్థకు చేరిందని, ఇది ప్రారంభం మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. పెద్దల సభలో టీడీపీ ఖాళీ అవుతోందని, పతనావస్థకు ఇదే నిదర్శనమని మంత్రి తెలిపారు. టీడీపీ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ అజెండాలో భాగంగానే షర్మిల పనిచేస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. మరి.. షర్మిలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.