RTC డ్రైవర్ పై ప్రయాణికుల దాడి.. ఆ చిన్న కారణానికే..

ఈ మద్య కొంతమంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురైతున్నారు. క్షణికావేశాలనికి లోనై ఎదుటివారిపై దాడులు చేస్తున్నారు.. కొన్ని సందర్భాల్లో హత్యలు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా బస్సు ప్రయాణాలు చేసే సమయంలో చిన్న చిన్న గొడవలు జరగడం చూస్తుంటాం. ముఖ్యంగా సీటు వివషయాల్లో ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతుంటాయి.  కొన్నిసార్లు ప్రయాణికులు కండెక్టర్, డ్రైవర్లపై దాడులకు తెగబడుతుంటారు. తాజాగా తాము అడిగిన చోట బస్సు ఆపలేదన్న కోపంతో కొంతమంది ప్రయాణికులు బస్ డ్రైవర్ ని చితకబాదారు. చిన్నకారణంతోనే డ్రైవర్ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని బోడియాయనిపల్లె దగ్గర ఆర్టీసీ బస్సు ఆపమని కొంతమంది ప్రయాణికులు డ్రైవర్ త్యాగరాజును కోరోగా అతను ఆపకుండా వెళ్లడంతో చిర్రెత్తుకొచ్చిన ప్రయాణికులు డ్రైవర్ పై దాడిచేసి గాయపరిచిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ బస్సు కుప్పం డిపోకు చెందినదిగా తెలుస్తుంది. కుప్పం-మదన పల్లె మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో కొంతమంది మదనపల్లె నుంచి పుంగనూరు వస్తుండగా బోడినాయునిపల్ల బస్టాప్ వద్ద బస్సును కొద్ది సేపు ఆపాల్సిందిగా కోరారు. ఇది ఎక్స్ ప్రెస్ బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపడం కుదరదు అంటూ అని సమాధానం ఇచ్చాడు డ్రైవర్ త్యాగరాజు.

బస్ డ్రైవర్ త్యాగరాజు సమాధానానికి కోపం తెచ్చుకున్న ప్రయాణికులు రెచ్చిపోయారు. బస్సు బలవంతంగా ఆపించారు.. దిగి డ్రైవర్ ని బయటకు లాగి దాడి చేసి గాయపరిచారు. గాయాలతోనే బస్సును డ్రైవర్ త్యాగరాజు సమీపంలోని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకు వెళ్లి నిలిపివేశాడు. రూల్స్ ప్రకారం తాను బస్సు ఆపలేదని.. ఆ  చిన్న కారణంతోనే తనపై దారుణంగా దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు డ్రైవర త్యాగరాజు. పట్టణంలోకి కొంతమంది స్టేషన్ కి చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపించి వేయడంతో కేసు నమోదు చేయలేదని తెలుస్తుంది. కాగా దీనికి సంబంధించి కొందమంది తమ మొబైల్ లో రికార్డు చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

Show comments