iDreamPost
android-app
ios-app

తిరుపతిలో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌‌ప్రెస్ రైలు!

తిరుపతిలో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌‌ప్రెస్ రైలు!

నిత్యం అనేక రకాల ప్రమాదాలు జరుగుతుంటాయి.  అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటాయి. వాటితో పాటు రైలు ప్రమాదాలు కూడా తరచూ జరుగుతున్న. రైళ్లు ప్రమాదాలు సంభవిస్తే.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా గతంలో ఎన్నో ఘటనలు జరిగాయి. కొన్ని రోజుల క్రితం ఒరిస్సాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం అందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 290 మంది మృతి చెందారు. అనంతరం మరికొన్ని ప్రాంతాల్లో కూడా రైళ్లు పట్టాలు తప్పిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా  సికింద్రబాద్- తిరుపతి మధ్య నడిచే పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

నెల రోజు క్రితం ఒరిస్సాలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో యావత్తు భారత దేశం కలత చెందింది. జూన్ 2న ఒరిస్సాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ లోకి వెళ్లి ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. ట్రాక్‌పై పడిన ఈ రైలు బోగీలను యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దాదాపు  290 మంది మృతి చెందగా.. వందల మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన తరువాత పలు ప్రాంతాల్లో వివిధ రైళ్లు పట్టాలు తప్పాయి. అయితే రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో పెను ప్రమాదాలు తప్పాయి. కొన్ని రోజుల క్రితం కూడా ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ రైళ్లు అగ్నికి ఆహుతైంది.  వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు రైళు చైన్ లాగి..కిందకు దిగారు.

తాజాగా సికింద్రబాద్-తిరుపతి మధ్ నడితే పద్మావతి రైలు పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వేస్టేషన్ లో పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 6వ నంబర్ ప్లాట్ ఫామ్ వద్ద పట్టాలు తప్పగా  అధికారులు గుర్తించారు. వెంటనే స్పందించి… పట్టాలు తప్పిన బోగిలను సరి చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా  ఉన్నారు. పద్మవతి రైలు పట్టాలు తప్పడంతో సాయంత్రం 4.55 బదులు రా.7.45 గంటలకు బయల్దేరనుంది. అదే విధంగా రాయలసీమ ఎక్స్ ప్రెస్  రా.8 గంటలకు సికింద్రబాద్ బయలేద్దరనుంది. అయితే ఇలా తరచూ రైళ్లు పట్టాలు తప్పడంపై  ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.