iDreamPost
android-app
ios-app

ఆ రైతు కూలీలను ఎక్స్ ప్రెస్ రైళ్లలో అనుమతించని అధికారులు.. ప్రత్యేక కారణం ఉంది!

రైల్వే అధికారులు రైతు కూలీలను ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణించకుండా అడ్డుకున్నారు. ఏకంగా 1300 మందిని అడ్డుకుని వెనక్కి పంపిచారు. దీంతో రైతు కూలీలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే అధికారులు రైతు కూలీలను ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణించకుండా అడ్డుకున్నారు. ఏకంగా 1300 మందిని అడ్డుకుని వెనక్కి పంపిచారు. దీంతో రైతు కూలీలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

ఆ రైతు కూలీలను ఎక్స్ ప్రెస్ రైళ్లలో అనుమతించని అధికారులు.. ప్రత్యేక కారణం ఉంది!

ఉన్నఊరిలో ఉపాధి కరువైంది. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లుదామంటే ఇప్పుడు ప్రయాణం కూడా కష్టమైపోయింది. భారతీయ రైల్వే వందలాది రైళ్లను నడుపుతున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఏమాత్రం సరిపోవడం లేదు. ఆఫీసులకు వెళ్లే వారు, వివిధ వృత్తి పనులు చేసుకునే వారు ట్రైన్ జర్నీకే మొగ్గు చూపుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిపోతున్నాయి. ఈ క్రమంలో రైతు కూలీలకు చేదు అనుభవం ఎదురైంది. కర్నూల్ జిల్లా కోస్గీ రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు పనుల కోసం వేళ్లే వారిని ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఎక్కనివ్వకుండా రైల్వే అధికారులు అడ్డుకున్నారు. ఏకంగా 1300 మంది రైతు కూలీలను అడ్డుకున్నారు.

వారంతా రెక్కాడితే గాని డొక్కాడని పేదవారు. పని చేస్తేనే తప్పా పూటగడవని పరిస్థితి. ఈ క్రమంలో స్థానికంగా పనులు దొరకకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు రైతు కూలీలు. కోస్గీ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతి రోజూ దాదాపు 2000 మంది కూలీలు పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఉదయం 8 గంటలకు కోస్గీ నుంచి రాయచూరు ఇతర ప్రాంతాలకు కూలీ పనుల కోసం వెళ్తుంటారు. కాగా రైల్వే అధికారులు రెండు రోజులుగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కూలీలను అనుమతించడంలేదు. దీంతో సుమారు 1300 మందికి పైగా రైతు కూలీలు చేసేదేం లేక ఉసూరు మంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రైవేట్ వెహికిల్స్ లో ప్రయాణించే స్థోమత లేక రైతు కూలీలు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటే తీవ్ర నిరాశ ఎదురవుతున్నది.

రైల్వే అధికారుల తీరుతో రైతు కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పని చేస్తే గానీ భార్యాబిడ్డలను పోషించుకోలేని పరిస్థితి. మమ్మల్ని అడ్డుకోని అన్యాయం చేస్తారా అంటూ రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నారు. మేము కూలి పనుల కోసమే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాం. జల్సాలకు, వ్యాపారాలు చేసేందుకు కాదు.. అయినా, మా మీద రైల్వే అధికారులకు కనికరం లేదు అంటూ రైతు కూలీలు తమ గోడు వెల్లబోసుకున్నారు. రైల్వే అధికారుల తీరుతో రెండు రోజులుగా పనులకు వెళ్లకుండా ఇంటికి వెనుదిరిగి వెళ్తున్నారు. అయితే రైల్వే అధికారులు మాత్రం ప్రయాణీకుల సౌకర్యం దృష్ట్యా రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కూలీలు రిజర్వేషన్ కంపార్ట్ మెంట్లలో ఎక్కడం నేరమని తెలిపారు. అందుకే అడ్డుకున్నామని రిజర్వేషన్‌ ఉంటేనే ప్రయాణీంచవచ్చని, లేకపోతే ప్రయాణాలు చేయడం నేరమని పేర్కొన్నారు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకే రైతు కూలీలను అడ్డుకున్నామని అధికారులు తెలిపారు.