P Venkatesh
మీ పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించాలని భావిస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. త్వరగా అప్లై చేసుకోండి.
మీ పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించాలని భావిస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. త్వరగా అప్లై చేసుకోండి.
P Venkatesh
పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనుకునే తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే చాలు. కుటుంబ పరిస్థితులు మార్చుకోవాలన్నా.. సమాజానికి మంచి చేయాలన్నా కేవలం చదువుతో మాత్రమే సాధ్యం. మరి ఈ రోజుల్లో ప్రభుత్వ బడులు ఉన్నప్పటికీ.. ప్రైవేట్ విద్యా సంస్థల వైపు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రేవేట్ విద్యాసంస్థలకు ధీటుగా అత్యున్నత ప్రమాణాలతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో భోదిస్తారు. మరి మోడల్ స్కూళ్లలో మీ పిల్లలను చేర్పించాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వెలువడింది.
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూళ్లలో 2024-25 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయబడవు. స్టూడెంట్స్ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 01 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం అప్లై చేసుకున్న వారికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను ఏప్రిల్ 21న నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆదారంగా అడ్మిషన్స్ కల్పిస్తారు. ఏప్రిల్ 21న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6వ తరగతిలో అడ్మిషన్ పొందేందుకు ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులు 35 మార్కలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
మంచి ఛాన్స్.. కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి అడ్మిషన్స్.. అర్హతలు ఏంటంటే?