iDreamPost

మంచి ఛాన్స్.. కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి అడ్మిషన్స్.. అర్హతలు ఏంటంటే?

మీ పిల్లలను అత్యత్తమమైన ప్రమాణాలు కలిగిన పాఠశాలల్లో చేర్పించాలనుకుంటున్నారా? అయితే కేంద్రీయ విద్యాలయాల్లో త్వరలో ఒకటో తరగతిలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి.

మీ పిల్లలను అత్యత్తమమైన ప్రమాణాలు కలిగిన పాఠశాలల్లో చేర్పించాలనుకుంటున్నారా? అయితే కేంద్రీయ విద్యాలయాల్లో త్వరలో ఒకటో తరగతిలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి.

మంచి ఛాన్స్.. కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి అడ్మిషన్స్.. అర్హతలు ఏంటంటే?

తమ పిల్లలకు ఆస్తిపాస్తులను సంపాదించి పెట్టకపోయినా ఫరవాలేదు కానీ మంచి విద్యను అందిస్తే చాలు. చదువుకు సాటి ధనం లేదు ఈ సృష్టిలో. నేటి రోజుల్లో విద్యకు ప్రాధాన్యత పెరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ను అందించడానికి ఇంట్రస్టు చూపిస్తున్నారు. పేదరికాన్ని పారద్రోలడానికి, జీవితాల్లో వెలుగులు నింపుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని విశ్వసిస్తున్నారు. ఖర్చుకు వెనకాడకుండా పిల్లలను ప్రముఖ స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. మరి మీ పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించాలనుకుంటే కేంద్రీయ విద్యాలయాలు ది బెస్ట్ అని చెప్పొచ్చు. నాణ్యమైన విద్యను అందించే కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పిస్తే భవిష్యత్ బంగారమయం అవడం ఖాయం. మరి ఇందులో చేరడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటంటే?

దేశంలో కేంద్రీయ విద్యాలయాలు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. అత్యున్నతమైన ప్రమాణాలు కలిగి నాణ్యమైన విద్యను అందిస్తుంటాయి ఈ విద్యా సంస్థలు. అందుకే ఈ స్కూళ్లో తమ పిల్లలను చేర్పించేందుకు పోటీపడుతుంటారు తల్లిదండ్రులు. మరి ఇందులో అడ్మిషన్ దక్కించుకోవాలంటే అంత సులభమేమీ కాదు. అప్లికేషన్ నుంచి ఎంట్రెన్స్ ఎగ్జామ్ వరకు ఎంతో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. దరఖాస్తులో తప్పులు దొర్లితే అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది.

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో పిల్లలను చేర్చాలంటే వారి వయసు కనీసం 6 సంవత్సరాలు ఉండాలి. 2024 ఏప్రిల్ 1 నాటికి 6 ఏళ్లు నిండిన విద్యార్థుల తరఫున వారి తల్లిదండ్రులు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరం కోసం త్వరలో అడ్మిషన్స్ ప్రారంభం కానున్నాయి. తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ ద్వారా ఆన్‌ లైన్‌లో తమ పిల్లల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి