Arjun Suravaram
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు బయటకు రావడంతో ఆయన కోసం మరణించారని టీడీపీ ప్రచారం చేసిన.. వారి కుటుంబాలను పరామర్శించే యాత్రకు బ్రేక్ పడినట్లేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు బయటకు రావడంతో ఆయన కోసం మరణించారని టీడీపీ ప్రచారం చేసిన.. వారి కుటుంబాలను పరామర్శించే యాత్రకు బ్రేక్ పడినట్లేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Arjun Suravaram
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవలే మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చి..కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇది ఇలా ఉంటే.. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక దాదాపు 150 మంది మరణించినట్లు, ఎల్లో మీడియా, టీడీపీ నేతలు తెలిపారు. అంతేకాక ఆ కుటుంబాలని పరామర్శించాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భావించారు. బాబు జైల్లో ఉండగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అయితే చంద్రబాబు బయటకు రావడంతో ఆ పరామర్శలు ఆగిపోయాయి. చంద్రబాబు బయటకు రావడంతో పరామర్శలు లేనట్టేనని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు పాలుకావడాన్ని తట్టుకోలేక సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోయినట్లు టీడీపీ ప్రకటించిన విషయం తెలిసింది. అలా చంద్రబాబు కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన భార్య భువనేశ్వరి పరామర్శించే యాత్ర ను కూడా ప్రారంభించారు. అలా పరామర్శించడంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. మరి.. వార్తల్లో నిజానిజాలు మాటేమిటో అటుంచితే.. ఇప్పుడు భువనేశ్వరి చేపట్టిన ఆ యాత్ర అర్దాంతరంగా ఆగిపోయింది. చంద్రబాబు రాక ముందు చేసిన పరామర్శలు.. ఆయన వచ్చిన తరువాత కనిపించడం లేదు.
చంద్రబాబు బయటకు వస్తారనే నమ్మకం లేకనే ఆ కుటుంబాలను పరామర్శించే యాత్రను టీడీపీ పెట్టుకుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే వారు అంచనాలు తలకిందులై..చంద్రబాబుకు బెయిల్ రావడం, ఆయన చికిత్స చేయించుకున్నారు. అంతేకాక నారా భువనేశ్వరి తిరిగి గృహిణిగా, బిజినెస్ వుమెన్ గా హెరిటేజ్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో.. బాబు కోసం మరణించిన ఆ 150 మంది కుటుంబాల పరామర్శ గాలికి పోయినట్టుగా ఉందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. బాబు జైల్లో ఉండగా.. ఆయన కోసం పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయన్నారు, ఆ కుటుంబాలను పరామర్శించాలన్నారు.
అయితే బాబుకు బెయిల్ రాగానే.. ఆ పరామర్శ వ్యవహారం వార్తల్లో లేకుండా పోయిందనే చర్చ నడుస్తోంది. మరి.. ఇంతకీ ఆ పరామర్శ, ఆర్థిక సాయం ఇక గాలికి పోయినట్టేనా అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే అనేక విషయాల్లో టీడీపీ షో చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. షో చేసే ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతమని అభిప్రాయ పడుతున్నారు. తాజాగా చంద్రబాబు కోసం మరణించారని ప్రచారం చేసుకుని, ఆ కుటుంబాల విషయంలోనూ పరామర్శ యాత్రకు బ్రేక్ వేయడం టీడీపీకే చెల్లినట్లుగా కామెంట్స్ వినిపిస్తోన్నాయి. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.